పితృసమానులైన ముద్రగడ మరణవార్త తీవ్రంగా కలిచివేస్తోంది.. వైఎస్ జగన్ ఎమోషనల్

Wait 5 sec.

కాపు ఉద్యమ నేత, పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీ సీనియర్ నేత, పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యానికి గురైనతమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు అందించారని జగన్ కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని.. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారంటూ ట్వీట్ చేశారు. తన జీవితాంతం కూడా ముద్రగడ పేదల బతుకుల్లో మార్పు కోసమే పరితపించారని.. కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, ఆ సామాజికవర్గ సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. నమ్మిన మాటకు కట్టుబడటం, దానికోసమే నిలబడే తత్వం ముద్రగడదని జగన్ కొనియాడారు. మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతమని.. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ముద్రగడ నిలువెత్తు రూపమని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం ఆయన కుటుంబ సభ్యులకే కాదు.. వైసీపీకి, ఆయనను అభిమానించే లక్షల మందికి తీరని లోటని వైఎస్ జగన్ అభివర్ణించారు. ఈ విషాద సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు.మరోవైపు పొందుతున్న ముద్రగడ పద్మనాభం.. పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. 73 ఏళ్ల ముద్రగడ పద్మనాభం పాతికేళ్లకే రాజకీయాల్లోకి వచ్చారు, తండ్రి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. కాపు ఉద్యమ నేతగా ఎదిగారు.