స్థిరంగా బంగారం, వెండి ధరలు.. జులై 13న హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే.. తులం ఎంతంటే?

Wait 5 sec.

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో మళ్లీ దాడులు చేస్తున్నారు. హార్ముజ్ జల సంధిని మళ్లీ మూసివేశారు. ఈ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పుంజుకోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి వాటితో గ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు దిగివచ్చాయి. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో నిన్నటి సెషన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు అదే ధర వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో జులై 13వ తేదీ సోమవారం రోజున హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటుఅంతర్జాతీయ బులియన్ మార్కెట్లో జులై 13వ తేదీన బంగారం, వెండి ధరలు భారీగానే దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 26 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 4079 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 1.48 శాతం దిగివచ్చింది. ప్రస్తుతం ఔన్స్ వెండి రేటు 58 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుక్రితం రోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.490 మేర దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు అదే ధర వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర సైతం స్థిరంగా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి ధరబంగారంతో పాటు వెండి రేటు సైతం క్రితం సెషన్‌లో తగ్గింది. కిలో వెండి రేటు నిన్నటి రోజున రూ.5000 తగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,40,000 మార్క్ వద్ద ట్రేడవుతున్నాయి. గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు జులై 13వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు ఉదయం 10 గంటల తర్వాత మారుతుంటాయి. కొనుగోలుదారులు స్థానికంగా ఉండే ధరలను తాము కొనే ముందే తెలుసుకోవడం మంచిది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.