ఇన్వెస్టర్లను ముంచేసిన టీసీఎస్, ఎస్బీఐ- కాపాడిన రిలయన్స్, ఎల్ఐసీ- ఏది బెస్ట్, ఏది వరెస్ట్?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ మరోవైపు గత వారంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే క్రూడాయిల్ ధరలు కనిష్ఠ స్థాయిల నుంచి పెరగ్గా ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో మళ్లీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని భారీగా ఉపసంహరించుకున్నారు. దీంతో కిందటి వారం జులై 6- 10 మధ్య 5 ట్రేడింగ్ సెషన్లలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 195 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్లు తగ్గుముఖం పట్టింది. తర్వాతి సెషన్లలో క్రమంగా కోలుకుంటూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల్లో 4 కంపెనీల మార్కెట్ విలువనే ఏకంగా రూ. 92,995.48 కోట్లు పెరిగింది. ఆయా కంపెనీల మార్కెట్ విలువనే ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తుంటారు. ఇక్కడ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎస్బీఐ మార్కెట్ విలువ తగ్గి ఇన్వెస్టర్లకు నష్టాల్ని మిగిల్చాయి. అత్యధికంగా కిందటి వారంలో HDFC బ్యాంక్ మార్కెట్ విలువనే రూ. 35,808.09 కోట్లు పెరగడంతో ప్రస్తుతం రూ. 12.69 లక్షల కోట్ల వద్ద ఎం- క్యాప్ ఉంది. భారతీ ఎయిర్‌టెల్ ఎం క్యాప్ (ఇన్వెస్టర్ల సంపద) రూ. 34,896.92 కోట్లు పెరగడంతో రూ. 11.98 లక్షల కోట్లుగా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మార్కెట్ వాల్యుయేషన్ కూడా కిందటి వారంలో రూ. 16 వేల కోట్లు పెరిగి రూ. 5.60 లక్షల కోట్లుగా ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా పుంజుకోగా మార్కెట్ విలువ రూ. రూ. 6,224 కోట్లు పెరిగి రూ. 17.71 లక్షల కోట్ల వద్ద ఉంది.ఇదీ చూడండి: పైన నాలుగు కంపెనీల మార్కెట్ విలువ పెరగ్గా దీనికి విరుద్ధంగా మరో 6 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ గత 5 ట్రేడింగ్ సెషన్లలో రూ. 12,088 కోట్లు తగ్గడంతో రూ. 5.04 లక్షల కోట్లుగా ఉంది. లారెన్స్ అండ్ టుబ్రో (LT) విలువ రూ. 11 వేల కోట్లు పతనమై రూ. 5.42 లక్షల కోట్లకు పడిపోయింది. టీసీఎస్ మార్కెట్ వాల్యూ 5 రోజుల్లో రూ. 8574 కోట్లు తగ్గి రూ. 7.48 లక్షల కోట్లకు చేరింది. బజాజ్ ఫినాన్స్ మార్కెట్ విలువ రూ. 7813 కోట్లు పడిపోయి రూ. 6.35 లక్షల కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 6315 కోట్లు తగ్గడంతో రూ. 10.05 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ. 3461 కోట్లు తగ్గి రూ. 9.56 లక్షల కోట్ల వద్ద ఉంది.