ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎకరా భూమి ధర ఎంత?. తాజాగా ఏపీ ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మానానికి సంబంధించి రైతులకు చెల్లించిన పరిహారంతో ఆసక్తికర విషయాలు తెలిశాయి. అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకంగా మారింది.. కొంతకాలంగా భూసేకరణకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. తాజాగా ఉండవల్లిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి ఉన్న ఒక్క అడ్డంకి తొలగిపోయింది. ఈ రోడ్డుకు సంబంధించి అవసరమైన 2.77 ఎకరాల భూమికి సీఆర్డీఏ అవార్డు పాస్‌ చేసింది.. అధికారులు ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు.ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి భూమిని స్వాధీనం చేసుకునే సమయంలో.. భూమి యజమానులు అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఓ మహిళ మహిళా ఎస్సైపై చేయిచేసుకున్నా పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. ఓ మహిళకు సంబంధించిన భూమిలో ఉన్న రేకుల షెడ్డును తొలగిస్తుండగా.. కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు. ఎట్టకేలకు భూమిని స్వాధీనంచేసుకుని కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో.. ఆ భూమిని చదును చేసే పనులు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటూ ఈ భూమి స్వాధీనం ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇప్పటికే ప్రకటనలు ఇచ్చిన గ్రామాల్లో కూడా అవార్డు నోటీసులిచ్చి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఉండవల్లిలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డుకు సంబంధించిన భూమి అంశం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. పదిమంది రైతులు ఈ భూమిని భూసమీకరణ కింద ఇవ్వలేదు.. దీంతో అధికారులు మొత్తం 2.77 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకున్నారు. ఈ మేరకు ఈ భూమికి సంబంధించి రూ.7.14 కోట్ల సొమ్మును తీసుకోవడానికి రైతులు నిరాకరించారు. దీంతో అధికారులు ఆర్‌అండ్‌ఆర్‌ కోర్టులో ఈ డబ్బుల్ని జమ చేసి.. భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉండవల్లిలో ఎకరాకు రూ.2.40 కోట్ల చొప్పున భూసేకరణ నిబంధనల ప్రకారం పరిహారం జమ చేశామని తెలిపారు. దీన్ని బట్టి ఉందనే చర్చ జరుగుతోంది.