‘సారంగ దరియా’ పాటకు బాలయ్య కుమార్తె డ్యాన్స్.. సాయిపల్లవి రేంజ్‌లో తేజస్విని స్టెప్పులు.. వీడియో వైరల్!

Wait 5 sec.

సీనియర్ హీరో చిన్న కుమార్తె, వైజాగ్ టీడీపీ ఎంపీ శ్రీభరత్ సతీమణి డ్యాన్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. తనలోని అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోతో వార్తల్లో నిలిచిన ఆమె, ఇప్పుడు మరో క్రేజీ వీడియోతో ఇంటర్నెట్ ను ఊపేస్తున్నారు.నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని సూపర్ హిట్ ‘సారంగ దరియా’ పాటకు తేజస్విని వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జానపద గీతానికి సాయి పల్లవి వెండితెరపై చేసిన డ్యాన్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాంటి క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్ కు తేజస్విని ఏమాత్రం తగ్గకుండా, ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో స్టెప్పులేస్తూ అదరగొట్టారు. కేవలం డ్యాన్స్ మూవ్స్ మాత్రమే కాకుండా, ఆ పాటకు తగ్గట్లుగా ఆమె పలికించిన హావభావాలు, అభినయం ఆకట్టుకుంటున్నాయి.తేజస్విని వీడియో చూసిన అభిమానులు నందమూరి వారసురాలి డ్యాన్స్ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలయ్య కుమార్తె అంటే ఆ మాత్రం ఎనర్జీ ఉండాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తండ్రి బాలకృష్ణ మాదిరిగానే తేజస్వినిలో కూడా అద్భుతమైన గ్రేస్, ఎనర్జీ ఉన్నాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తేజస్విని ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.