ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఏబీవీ వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సోషల్ మీడియాతో పాటుగా బయటు కూడా హాట్ టాపిక్ అయ్యింది. కొంతమంది ఏబీ వెంకటేశ్వరరావు తీరును తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఏబీవీపై కక్షసాధించిందని.. ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తితో వేదిక ఎలా పంచుకుంటారని కొందరు ప్రశ్నించారు. తనపై విమర్శలు రావడంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెంకటేశ్వరరావు స్పందించారు.? అంటూ ఎవర్ని చూసినా అదే ప్రశ్న వినిపిస్తోందని.. అందరికీ కలిపి సమాధానం ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు వెంకటేశ్వరరావు. 'మాట్లాడే స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా అసలు? జగన్ అసలు మాట్లాడనిచ్చాడా? ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలనుకుంటోందా? పక్కన ఉన్న నేనే అంబటి ఏం మాట్లాడాడో వినలేదు. Just ignored. Why can’t you do the same? Just ignore? అంబటి నా పక్కన కూర్చుంటే నేను లేచి వెళ్లిపోవడం సభా మర్యాదా? పిలిచిన పెద్దలు ఏమనుకుంటారు?. నేను నా మర్యాద నిలుపుకోవద్దా?.. మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను సంస్కారం వదిలెయ్యాలా?. మీరు నా గురించి పొరబడ్డారు.. నేనలాంటి వాడిని కాదు. మళ్లీ ఇందులోకి రావణ్ ప్రస్తావన తేవద్దు.. అది ఇంకో పోస్టు లోనో సందర్భం లోనో వివరంగా చెబుతాను' అంటూ క్లారిటీ ఇచ్చారు.'నన్ను అభిమానించే వాళ్ల అనుమానాలు (మా అమ్మ తో సహా) తీర్చేందుకు.. భక్తుల “ఆహా దొరికేశాడురోయ్” అనుకుని పడుతున్న సంతృప్త స్థాయి మేరకు, ఓ మీడియా సంస్థ కథన కదన కుతూహలం మేరకు, నా ఫోన్ లో ఉన్న సంబంధిత స్క్రీన్ షాట్స్ అన్నీ బహిరంగ ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నాను. పోలీసులు శ్రమ పడకుండా, లీకులిచ్చే బాధ లేకుండా “అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకు తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి” అని మాడిపోయిన మసాలా దోసె తింటూ తింటూ ఆపేసిన కుతూహల రావులందరికీ ఉపశమనం కలగబోతోంది. కావాలనే కొంచెం టైం ఇస్తున్నాను. ఈ లోగా ఎన్ని కుట్రల కథలు అల్లుకోగలరో, ఎన్ని sponsored వీడియోలు చేయించి వదలగలరో వదలండి' అంటూ మరో ట్వీట్ కూడా చేశారు ఏబీ వెంకటేశ్వరరావు.