ఇవేం అద్దెలు బాబోయ్- దేశంలోనే టాప్- చిన్న షాప్ కోసం నెలకు లక్షలు కట్టాల్సిందే!

Wait 5 sec.

: రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత కాలంగా విపరీతంగా వృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. నివాస గృహాల దగ్గర్నుంచి మొదలుకొని, ఆఫీస్ స్పేస్, రిటైల్ మార్కెట్ ఇలా అన్నింటి ధరలు, అద్దెలు పెరుగుతున్నాయి. ధరలు విపరీతంగా ఉన్నా సేల్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం రిటైల్ స్పేస్ (రిటైల్ దుకాణాలు) అద్దెల గురించి చూద్దాం. దేశంలో చూస్తే ఢిల్లీ- NCR ప్రాంతం పరిధిలోని ప్రధాన వ్యాపార వీధుల్లోనే అద్దెలు రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. కేవలం మాల్స్ మాత్రమే కాకుండా హై స్ట్రీట్ మార్కెట్లకు కూడా గ్లోబల్, డొమెస్టిక్ బ్రాండ్ల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ లేటెస్ట్ డేటా ప్రకారం- ఢిల్లీ- NCR‌ లోని ప్రధాన మార్కెట్లలో నెలవారీ అద్దెలు ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో సుమారు 2 నుంచి 10 శాతం వరకు పెరిగాయి. ఇందులో దేశంలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉండే ఖాన్ మార్కెట్ తన టాప్ స్థానాన్ని పదిలం చేసుకుంది. సౌత్ ఎక్స్‌టెన్షన్ ఏకంగా రెండంకెల వృద్ధితో షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడ అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయి. చదరపు అడుగుకు ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం. ఖాన్ మార్కెట్‌లో వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్- జూన్ సమయంలో అద్దెలు 9 శాతం పెరిగి ఇప్పుడు చదరపు అడుగుకు రూ. 1700- 1800 వరకు పలుకుతోంది. అంటే ఈ లెక్కన ఇక్కడ చిన్న 100 చదరపు అడుగుల షాపు కోసమైనా నెలకు రూ. 1.70 లక్షల వరకు అద్దె రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. Read Also: కన్నాట్ ప్లేస్‌‌లో అద్దె 2 శాతం మేర పెరగ్గా ఇక్కడ చదరపు అడుగుకు రూ. 1250- 1300 గా ఉంది. గురుగ్రామ్ గ్యాలెరియా మార్కెట్లో 4 శాతం పెరగ్గా ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 1250- 1350 వరకు ఉంది. సౌత్ ఎక్స్‌టెన్షన్ (I&II) విషయానికి వస్తే ఇక్కడ వార్షిక అద్దె 10 శాతం పెరగ్గా చదరపు అడుగుకు రూ. 850- 900 మధ్య ఉంది. కమలా నగర్ ఏరియాలో చదరపు అడుగుకు రూ. 490- 510 వద్ద అద్దె స్థిరంగానే ఉంది. గ్రేటర్ కైలాష్- I (M బ్లాక్) 2 శాతం పెరిగి చ.అడుగుకు రూ. 490- 510 గా ఉంది. నోయిడా సెక్టార్ 18 లో 5 శాతం పెరిగి రూ. 210-230 గా ఉంది. గురుగ్రామ్ సెక్టార్ 29 లో 3 శాతం పెరిగి రూ. 180- 200 వద్ద ఉంది. రికార్డు స్థాయిలో అద్దె, లీజింగ్ జోరుకు కారణాలుఢిల్లీ- NCR లో షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ గతేడాది ఏప్రిల్- జూన్ సమయంలో 0.30 మిలియన్ చ. అడుగులుగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 0.67 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. దీంట్లో మాల్స్ వాటా 63 శాతం కాగా, మెయిన్ స్ట్రీట్స్ వాటా 37 శాతంగా ఉంది. గత క్యాలెండర్ ఇయర్ 2025లో ఢిల్లీ- NCR రిటైల్ లీజింగ్ ఏకంగా 2.25 మిలియన్ చ. అడుగులను తాకింది. 2019 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. దీంట్లో 55 శాతం లీజింగ్ కేవలం ప్రధాన రోడ్లపైనే జరగడం గమనార్హం. ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్ వంటి ప్రాంతాల్లో కొత్త స్టోర్లకు స్థలం దొరకడం గగనంగా ఉంది. కానీ లగ్జరీ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ప్రీమియం రెస్టారెంట్ బ్రాండ్స్ ఇక్కడే తమ ఉనికిని చాటుకోవాలని పోటీపడుతుండటంతో అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి.