షేర్లు కొనడానికి 30 సెకన్లు చాలు.. కానీ ఎప్పుడు అమ్మాలో తెలవడమే అసలు నైపుణ్యం.. ఎవరూ చెప్పని టిప్స్ మీకోసం..!

Wait 5 sec.

Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్న వారు అందరూ ఏ షేరు కొనాలి, ఏ మల్టీబ్యాగర్ స్టాక్ ఎంచుకోవాలి అనే విషయంపైనే ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు. కానీ, కొన్ని షేరును ఎప్పుడు అమ్మాలో చాలా మందికి తెలియదు. నిజానికి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడానికి కేవలం 30 సెకన్లు సరిపోతుంది. కానీ, చెబుతుంటారు. చాలా మంది ఇన్వెస్టర్లు తాము కొన్న స్టాక్స్ ను కేవలం రెండు కారణాల వల్లే అమ్ముతారు. అందులో ఒకటి భయం, రెండు సహనం కోల్పోవడం. కానీ, అంతకు ముంచిన అంశాలు ఉంటాయి.ఇన్వెస్టర్లు చేసే పొరపాట్లు ఇవేఒక స్టాక్ ధర కొద్దిగా పడగానే భయపడిపోయి అమ్మేస్తుంటారు. లేదా ఒక మంచి షేరు కొన్న తర్వాత ఏడాది పాటు అది ఎక్కడికీ కదలకుండా ఒకే రేంజ్‌లో ఉంటే బోర్ కొట్టి సహనం కోల్పోయి విక్రయిస్తుంటారు. నిజానికి ఇవి మార్కెట్ నియమాలు కావు. కేవలం మన మానసిక పరిస్థితికి సంబంధించిన అంశాలు మాత్రమే. ఒక బిజినెస్ విలువ ఏంటో మీకు పక్కాగా తెలిస్తే ఆ షేరును ఎప్పుడు ఉంచుకోవాలి, ఎప్పుడు వదిలించుకోవాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది.ఎవరూ చెప్పని కొన్ని టిప్స్..మంచి కంపెనీలను గుర్తించడం: లాంగ్ టర్మ్‌లో నిలబడే పోటీతత్వ ప్రయోజనాలు ఉన్న కంపెనీలను ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాలి. పోటీదారులను తట్టుకునే శక్తి ఉన్న కంపెనీలను ఎంచుకోగలిగితే దీర్ఘకాలంలో షేరు మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంటుంది. బ్రాండ్ వాల్యూ, మోనోపలీ, ఎప్పటికీ చెరిగిపోని ప్రత్యేకత ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ముఖ్యం.స్టాక్-పికింగ్ చెక్‌లిస్ట్: చాలా మంది ఐటీ స్టాక్స్ కొనేందుకు ఒకలాంచి రీసెర్చ్, బ్యాంకింగ్ లేదా ఫార్మా స్టాక్స్ కోసం మరోలాంటి రీసెర్చ్ చేస్తూ గందలగోళపడతారు. ఏ రంగానికి చెందిన కంపెనీకైనా, ఏ కాలంలోనైనా సరిపోయే ఒక పక్కా ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకోవాలి. దీంతో మీరు ఒక కొత్త స్టాక్ చూడగానే ఈ చెక్‌లిస్టులోని రూల్స్ అప్లై చేసి అది మీ పోర్ట్ ఫోలియోకు సెట్ అవుతుందా లేదా అని కేవలం కొన్ని నిమిషాల్లోనే సొంతంగా తేల్చుకోగలుగుతారు. దీంతో ఎవరి రికమండేషన్లపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించే నంబర్: కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో వేల కోట్ల ఆదాయం చూపిస్తూ భారీగా లాభాలు వచ్చాయని కలరింగ్ ఇస్తాయి. కానీ లోపల చూస్తే అప్పుల ఊబిలో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లలో ఉండే మాయాజాలాన్ని పక్కనబెట్టి కంపెనీ నిజంగా బలంగా ఉందో లేదో మ్యాజిగ్ నంబర్ గురించి తెలుసుకోవాలి.ఫెయిర్ వాల్యూ నిర్ధారణ: ఒక కంపెనీ ఎంత అద్భుతమైనదైనా సరే దాని షేరు ధర విపరీతంగా పెరిగిపోయి ఉన్నప్పుడు కొంటే మీకు లాభాలు రావు సరికదా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక స్టాక్ ధర ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం చౌకగా ఉందా, కరెక్ట్ రేటు లో ఉందా లేక చాలా ఖరీదైనదిగా ఉందా అనే విషయాన్ని తెలుసుకోగలగాలి.