వేడి మొదలైంది. సాధారణంగా ఎన్నికల వేళ.. అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ హీట్ నడిస్తే.. ఈసారి టీడీపీ, జనసేన మధ్య ఆ వాతావరణం కనిపించేలా ఉంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి మంత్రులు , చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. జనసేన మాజీ నేత చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోహర్ మాటలకు.. నారా లోకేష్ లెక్కలకు పొంతన ఎక్కడ అంటూ బొలిశెట్టి ప్రశ్నించారు."2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారని..కానీ తగ్గుతుందని భావించడం పొరపాటు. సార్వత్రిక వర్తించదు. జనసేన కోసం కష్టపడి పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన అవకాశాలు కల్పిస్తాం." అంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారన్న బొలిశెట్టి సత్యనారాయణ.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసిన ప్రకటన దీనికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమిలో సీట్ల పంపిణీ టీడీపీ 80 శాతం, జనసేన 15 శాతం, బీజేపీ 5 శాతం అనే నిష్పత్తిలో ఉంటుందని నారా లోకేష్ చెప్పారని బొలిశెట్టి గుర్తు చేశారు. మనోహర్ "తగ్గేదే లేదు" అంటుంటే, లోకేష్ మాత్రం "తగ్గాల్సిందే" అంటున్నారు.. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు కూటమిలోని జనసేన, బీజేపీ కార్యకర్తల్లో మరింత అభద్రతాభావాన్ని, ఆందోళనను పెంచుతున్నాయి.. జనసైన్యం ఎవరిని నమ్మాలి? అని బొలిశెట్టి ప్రశ్నించారు. నామినేటెడ్ పదవుల విషయంలో మోసపోయామనే తీవ్ర అసంతృప్తి జనసేనలో ఉందన్న బొలిశెట్టి సత్యనారాయణ.. ఇలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగితే పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. కూటమి విజయం కోసం పవన్ కళ్యాణ్ వీటిని భరించినా.. ఆ త్యాగాలను నమ్మి పనిచేసిన జనసైన్యం మాత్రం భరించదని.. మౌనంగా ఉండదని స్పష్టం చేశారు. ఇకనైనా కూటమి నాయకత్వం స్థానిక ఎన్నికల సీట్ల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని, అది క్షేత్ర స్థాయిలో అన్ని పార్టీల కార్యకర్తలకు అభిమానులకు చేరేలా చేయాలని బొలిశెట్టి సత్యనారాయణ సూచించారు. సీట్ల నిష్పత్తిని పునఃసమీక్షించి బహిరంగంగా ప్రకటించాలని.. నారా లోకేష్ ప్రకటించిన నిష్పత్తిపై బహిరంగ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు, అప్పుడే కూటమిపై నమ్మకం పెరుగుతుందని.. స్థానిక ఎన్నికల్లో ఆశించిన విజయాలు సాధించడం సాధ్యమవుతుందని బొలిశెట్టి సత్యనారాయణ అంచనా వేశారు.