Covid Cases Update in AP & Overall India – It Is not a Dangerous Variant, No Need to Panic: Minister

Wait 5 sec.

 Covid Cases Update inAP & Overall India – It Is not a Dangerous Variant, No Need to Panic:Minister(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ మరియుదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల తాజా పరిస్థితి – ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి=================ఏపీ లో 13కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 26 నుంచి జులై 17 వరకునాలుగు జిల్లాల్లో 13 కొవిడ్ కేసులునమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు మృతిచెందినట్లు పేర్కొంది. అయితే మరణించిన వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయనివెల్లడించింది. రాష్ట్రంలో 67 మందికిచెందిన నమూనాలు పరీక్షించగా.. 11 మందికి పాజిటివ్నిర్ధరణ అయినట్టు తెలిపింది. కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుసీఎంసీలో కొవిడ్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది.“వేర్వేరుప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకే చోట గుంపుగా బయటపడలేదు. మరో 5 నమూనాలను పరీక్షల నిమిత్తం పుణె ల్యాబ్ కు పంపాం. స్వీయగృహనిర్బంధంలో ముగ్గురు, ఇద్దరికిఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. మరో ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందినిఅప్రమత్తం చేశాం. జులై 1 నుంచి దేశవ్యాప్తంగా 300 కిపైగా  కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ 18, దిల్లీలో 18, రాజస్థాన్ లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కొవిడ్ కేసులు నమోదయ్యాయి” అని ఆరోగ్య శాఖవెల్లడించింది.కరోనాప్రమాదకర వేరియంట్ కాదు.. ఆందోళన వద్దు: మంత్రికరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలుఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అది ప్రమాదకరవేరియంట్ కాదని, కొవిడ్‌తో పాటు హెమటాలజీ, హైబీపీ కారణంగానే కొందరు మరణించారని చెప్పారు. గత 20 రోజుల్లో కేరళంలో 115, కర్ణాటకలో 64, తమిళనాడులో 39, ఏపీలో 13 పాజిటివ్ కేసులునమోదయ్యాయని పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అసలు వేరియంట్తెలుస్తుందన్నారు.=================Vijayawada, Andhra Pradesh: Minister Satya Kumar Yadav says, "....In the last 20 days, there was a case in Karpa. We are continuously tracing it. We have taken measures in all the hospitals, whether it is for RT-PCR, antibiotics, medicines or PPE kits. There is no need to… pic.twitter.com/Y21w06S05y— IANS (@ians_india) July 17, 2026 (adsbygoogle = window.adsbygoogle || []).push({});