ఆంధ్రప్రదేశ్‌లో సమ్మర్ 2.O.. ఎండలు, వేడి గాలులు.. ఏకంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో వాతావరణం ఎండాకాలాన్ని గుర్తు చేస్తోంది. వాస్తవానికి జులై నెలలో వర్షాలు పడాల్సిందిపోయి.. వేడిగాలులు, ఎండల తీవ్రత కనిపిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడగాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా రాయలసీమలోని ప్రాంతాల్లో వేసవి మాదిరిగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపించాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధరణం కన్నా నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బాపట్లలో ఏకంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా జంగమేశ్వరపురం, తిరుపతిలో 41 డిగ్రీలు.. ఒంగోలులు 40.5 డిగ్రీలు, నంద్యాలలో 40.2, నెల్లూరులో 40.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం రోజులు వర్షాలు పడవని.. ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని చెబుతోంది వాతావరణశాఖ.ఆదివారం రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వేడిగాలులు వీచాయి. కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమ జిల్లా్లో వేడి వాతావరణం కొనసాగింది. ఈ నెల మొదటి వారం అక్కడక్కడా వర్సాలు పడినా.. ఆ తర్వాత మళ్లీ వాతావరణం మారిపోయింది. మళ్లీ ఎండలు, వేడిగాలుల ప్రభావం పెరిగింది. ఈ వేడిగాలులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈనెల మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఈ అల్పపీడనం ఏర్పడినా ఉత్తరాంధ్ర జిల్లాలలో మాత్రమే వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో వర్షాభావం కొనసాగుతుందని.. ఈ నెల 22వ తేదీ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటే వానలు పడే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 శాతం లోటు వర్షపాతం ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. ఇది ఖరీఫ్‌ పంటలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్ని గమనిస్తే.. ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.