రూ. 8 నుంచి 1976కు పెరిగిన షేరు- లక్షకు నాలుగేళ్లలోనే రూ. 2.42 కోట్లు వచ్చాయ్- ఓపికతోనే లాభాలు!

Wait 5 sec.

Multibagger Stocks: షేర్ మార్కెట్లో ఓపిక ఉంటేనే కోట్లు సంపాదించొచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ స్టాక్. ఒకప్పుడు కేవలం రూ. 8 వద్ద ట్రేడ్ అయిన చిన్న పెన్నీ స్టాక్ ఇప్పుడు రూ. 1970 దాటి దూసుకెళ్తోంది. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ రంగంలో ఉన్న ఈ స్మాల్ క్యాప్ కంపెనీ ఇన్వెస్టర్లకు కేవలం నాలుగేళ్లలోనే 24149 శాతం లాభాల్ని అందించింది. కంపెనీకి వస్తున్న భారీ ఆర్డర్స్, లాభాల వృద్ధి ఈ ఊహించని విజయానికి కారణం. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. 2022 డిసెంబర్ 16న ఈ స్టాక్ ధర కేవలం రూ. 8.15 వద్ద ఉండేది. అప్పుడు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మొత్తం 12,270 షేర్లు వచ్చి ఉండేవి. జులై 17 ధర చూస్తే రూ. 1976.30 గా ఉంది. అదే రూ. 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ. 2.42 కోట్లకు చేరడం విశేషం. మార్కెట్ చరిత్రలోనే అత్యుత్తమ రిటర్న్స్ అందించిన వాటిల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 2,206.05 కాగా గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 10 శాతం తక్కువలో ఉంది. కనిష్ఠ ధర రూ. 1050 గా ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 3.11 వేల కోట్లుగా ఉంది.ఈ కంపెనీ విషయానికి వస్తే స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ కంపెనీ ఆటోమొబైల్, పవర్, ఇండస్ట్రియల్ రంగాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వైరింగ్ హార్నెస్, ఆటోమోటివ్ కేబుల్స్, బ్యాటరీ కేబుల్స్, స్విచ్ గేర్స్, ఈవీ ఫాస్ట్ ఛార్జర్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ష్నైడర్, పానాసోనిక్, లెగ్రాండ్, హేగర్, ఏబీబీ వంటి దిగ్గజ కంపెనీలు ప్రధాన కస్టమర్లుగా ఉన్నాయి.Read Also: గతంలో కేవలం కొద్ది మంది కస్టమర్లపైనే ఆధారపడిన ఈ కంపెనీ ఇటీవల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరాల కోసం కంపెనీ దాదాపు రూ. 140- 150 కోట్ల పెట్టుబడి పెడుతోంది. కొత్త ప్లాంట్స్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయని కంపెనీ నమ్ముతోంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4 త్రైమాసికంలో రూ. 169 కోట్లుగా ఆదాయం ఉంటే ఇటీవల క్యూ4లో రూ. 283 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ. 14 కోట్ల నుంచి రూ. 26 కోట్లకు పెరిగింది.గమనిక: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. అప్పుడే రిస్క్ తగ్గించుకోవచ్చు.