భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అంతర్జాతీయ వన్డే భవిష్యత్తుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి వీరిని తప్పిస్తారనే రూమర్స్ వస్తున్న నేపథ్యంలో, టీమిండియా మాజీ ఆటగాడు సీనియర్ ద్వయానికి పూర్తి మద్దతుగా నిలిచాడు. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగబోయే ఆ మెగా టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలవాలంటే ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం జట్టుకు చాలా కీలకమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇచ్చిన వేళ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఓ షోలో మాట్లాడిన మహమ్మద్ కైఫ్, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ మునుపటి టోర్నీల కంటే చాలా భిన్నమైన సవాళ్లను విసురుతుందని విశ్లేషించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాలోని పిచ్‌లు బౌన్స్‌కు అనుకూలిస్తాయని, అలాంటి కఠినమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు ఉండటం జట్టుకు ఎంతో బలనిస్తుందని చెప్పాడు. యువ ఆటగాళ్లతో మాత్రమే బరిలోకి దిగి, అక్కడి పరిస్థితులను తట్టుకోవడం కష్టమని హెచ్చరించాడు. అందుకే ఇప్పటి నుంచి జరగబోయే వన్డే మ్యాచ్‌లలో వీరిద్దరూ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి మంచి ఫామ్‌లో కొనసాగడం టీమిండియాకు ఎంతో మంచిదని కైఫ్ సూచించాడు.ఈ సందర్భంగా కైఫ్ క్రీడా ప్రపంచంలో అనుభవానికి ఉండే విలువను వివరిస్తూ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో రోహిత్, విరాట్‌ల ప్రాధాన్యతను పోల్చాడు. మెస్సీకి 39 ఏళ్ల వయసు వచ్చినా అతడి జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చేరిందని గుర్తుచేశాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గోల్ చేయకపోయినా, అద్భుతమైన అసిస్ట్‌తో జట్టు విజయానికి కారణమయ్యాడని వివరించాడు.మైదానంలో కేవలం రన్స్ చేయడం లేదా గోల్స్ చేయడమే కాకుండా, యువ ఆటగాళ్లను ఒత్తిడి సమయంలో ఎలా నడిపించాలో, వారికి ఎలా అవకాశాలు సృష్టించాలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మాత్రమే తెలుస్తుందని కైఫ్ చెప్పుకొచ్చాడు. అర్జెంటీనాకు మెస్సీ ఎంత బలమో, భారత్‌కు రోహిత్, కోహ్లీ అంతే బలమని అన్నాడు. ఆట ఏదైనా సరే అనుభవం అనేది ఆటను మలుపు తిప్పుతుందని కైఫ్ స్పష్టం చేశాడు.