పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు.. నేను ఆ తప్పు తెలుసుకున్నా.. జీవితంలో మళ్లీ అలా చేయను: రాజేష్ మహాసేన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ రాజేష్ స్పందించారు. 2019 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై ప్రధానంగా ప్రస్తావించారు.. అలాగే గతంలో తాను జనసేన పార్టీలో చేరాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాలతో టీడీపీలో చేరానని కొన్ని కీలక అంశాలను.' గారు క్షమించండి సార్.. నేను వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ల లాగే మీపై దురుసుగా మాట్లాడాను.. జగన్ గారి కోసమే నేను అలా మాట్లాడినా ఇప్పుడు అదే వైసీపీ ఆ వీడియోలతో నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. వాళ్లు ఎన్నిసార్లు ఆ వీడియోలు బయటకి తీసుకొస్తే.. నేను అన్నిసార్లు మీకు క్షమాపణ చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. ఇది రాజకీయం కోసం, పదవుల కోసం కాదండి.. ఇది నా హృదయపూర్వక పశ్చాత్తాపం. నేను 2019లో జగన్ గారి గెలుపులో భాగస్వామిగా ఉన్నాను.. నేను ఏ పదవులకోసం పనిచేయనని జగన్ గారికి కూడా తెలుసు.. అలాగే బాబు గారి దగ్గర జాయిన్ అయినప్పుడు కూడా నేను ఏ పదవి అడగలేదు. సందర్భానుసరం ఆయనే నాకు అవకాశాలు ఇచ్చారు.. అలాగే జనసేనలో నేను జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఏ పదవి అడగలేదు ఆ విషయం మీకు కూడా తెలుసు' అన్నారు. 'నేను పదవుల కోసం మాత్రమే పనిచేయను అనడానికి ఈ సంఘటనలే సాక్ష్యం. 2019కి ముందు మీపై మాట్లాడిన వీడియోలు ఇప్పుడు చూసినప్పుడు నేను చాలా సిగ్గు పడతాను సార్. గతాన్ని మార్చలేను.. భవిష్యత్తులో నేను మీతో విభేదించను అని చెప్పలేను కానీ అలాంటి దురుసు మాటలు మాత్రం నా జీవితంలో మాట్లాడను అని ఖచ్చితంగా చెప్పగలను సార్. నేను మీకు వ్యతిరేకంగా 10 వీడియోలు మాట్లాడిఉంటాను.. కానీ నా తప్పు తెలుసుకున్నాక వందల వీడియోలు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. అలాగే 2018లో నేను హిందూ మతం, అగ్రకులం అంటూ చేసిన కామెంట్లకి కూడా చాలా పశ్చాత్తాపం పడుతున్నాను. ఎందుకంటే ఏ కులం మతంలోను అందరూ మంచివాళ్లు కానీ చెడ్డవాళ్లు కానీ ఉండరు అని తెలుసుకున్నాను. కనుక ఈ 8 సంవత్సరాల్లో మళ్లీ అలాంటి కామెంట్లు నేను ఎక్కడా చేయలేదు.. భవిష్యత్తులో కూడా చేయను.. వారికి కూడా ఇదే నా బహిరంగ క్షమాపణ. అవకాశం వచ్చిన్నప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి క్షమాపణ చెప్తాను' అన్నారు రాజేష్ మహాసేన.