పోలవరం: తీవ్ర విషాదం.. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి..

Wait 5 sec.

పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలవరం జిల్లాలోని ఎటపాక మండలం గొల్ల గూడెం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల కోసమని గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు.. నీటిలో మునిగి గల్లంతయ్యారు. నదిలో లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే వారంతా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఐదు మృతదేహాలను వెలికి తీశారు. మృతులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒకేరోజు అనుకోని రీతిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.