మ్యూచువల్ ఫండ్లలో 10x10x10 ఫార్ములా గురించి తెలుసా? సింపుల్‌ ట్రిక్‌తో 10 లక్షల అదనపు లాభం!

Wait 5 sec.

: డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దానిని పెట్టుబడిగా పెట్టి పెద్ద సంపదగా మార్చడం మరో ఎత్తు. ఇక్కడ చాలా మంది దీర్ఘకాలంలో మెరుగైన సంపద కోసం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు చూస్తుంటారు. ఇక్కడ సిప్ లేదా లంప్ సమ్ రెండు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ సిప్ పెట్టుబడి గురించి చూద్దాం. చాలా మంది బెస్ట్ ఫండ్స్ కోసం వెతుకుతూ, మార్కెట్ ఎప్పుడు పడుతుందా అని టైమింగ్ కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేస్తుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లలో కావాల్సింది తెలివితేటలు కాదు. ఆర్థిక క్రమశిక్షణ, ఓపిక. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మీ పెట్టుబడిని పెంచుకుంటూ పోయే 10x10x10 సిప్ రూల్ ద్వారా దీర్ఘకాలంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించొచ్చో తెలుసుకుందాం. అంటే మ్యూచువల్ ఫండ్లలో వీలైనంత చిన్న వయసులోనే చేరడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. 10x10x10 రూల్ ఏంటి? ఇందులో మొదటి 10 మీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను కనీసం 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగించాలి. రెండో పది - దీర్ఘకాలిక ప్లానింగ్ కోసం వార్షికంగా సగటున 10 శాతం వార్షిక వడ్డీ రేటును ప్రాథమిక అంచనాగా తీసుకోవాలి. మూడో 10- స్టెప్ అప్ అమౌంట్- అంటే ఏటా మీ నెలవారీ సిప్ మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోవాలి.ఈ రూల్ ముఖ్య ఉద్దేశం మార్కెట్ హెచ్చుతగ్గుల్ని అంచనా వేయడం కాదు. మీ ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచే అలవాటును అలవర్చుకోవడం. ఇక్కడ లెక్కల ద్వారా తెలుసుకుందాం. ఒక ఇన్వెస్టర్ నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించి, పదేళ్ల పాటు 10 శాతం వార్షిక వడ్డీ అంచనాతో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. Read Also: సాధారణ సిప్ ‌లో నెలకు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లకు 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ. 20.48 లక్షలు వస్తాయి. ఇదే 10 శాతం స్టెప్ అప్ సిప్ లెక్కన చూస్తే అదే పదేళ్లకు 10 శాతం వార్షిక వడ్డీ అంచనాతో రూ. 30.45 లక్షలు వస్తాయి. పైన గణాంకాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మారొచ్చు. ఇక్కడ స్టెప్ అప్ సిప్ 10 శాతం అంటే తొలి ఏడాది నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ చేస్తే, రెండో ఏడాది సిప్ పెట్టుబడి రూ. 11 వేలు పడుతుంది. మూడో ఏడాది రూ. 12100 చొప్పున సిప్ పెట్టుబడి పడుతుంది. సాధారణంగా ప్రతి ఏడాది జీతాలు పెరుగుతుంటాయి కాబట్టి ఈ కొద్దిపాటి పెంపును సులభంగా భరించొచ్చు. ఇలా సాధారణ సిప్‌తో పోలిస్తే 10 శాతం సిప్ పెంచుకుంటూ పోవడం ద్వారా పదేళ్లలో అదనంగా రూ. 10 లక్షల సంపద క్రియేట్ అవుతుంది.