LIC Premium Payment: ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ పాలసీదారులకు షాకిచ్చింది. తన అధికారిక వెబ్‌సైట్, యాప్‌లల్లో క్రెడిట్ కార్డు ద్వారా పాలసీ ప్రీమియం చెల్లించే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది. 15 రోజుల క్రితమే ఈ ఆప్షన్ తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎల్ఐసీ యాప్‌లో కేవలం నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, యూపీఐ ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.ఎల్ఐసీ పాలసీ ప్రీమియంలను ఇతర థర్డ్ పార్టీ యాప్స్, ప్లాట్ ఫామ్స్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించేటప్పుడు ఫీజులు చెల్లించాల్సి ఉండేది. అదే ఎల్ఐసీ పోర్టల్, యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినప్పుడు గేట్ వే ఛార్జీలు, కన్వీనియన్స్ ఛార్జీలను కస్టమర్ల తరపున ఎల్ఐసీనే భరించేది. అయితే, క్రెడిట్ కార్డులతో ప్రీమియం చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగడం, ఫీజుల భారం అధికం అవుతుండడంతో క్రెడిట్ కార్డు ఆప్షన్ పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఒక వేళ క్రెడిట్ కార్డు ద్వారా బిల్లు పేమెంట్ చేయాలంటే భారత్ బిల్ పేమెంట్ పే, దానితో అనుసంధానమైన బిల్లు పేమెంట్ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చని ఎల్ఐసీ తన వెబ్‌సైట్లో పేర్కొంది. అంటే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వార్ పాలసీ ప్రీమియం చెల్లింపులకు క్రెడిట్ కార్డు పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చని అర్థమవుతోంది. అయితే, ఆయా ప్లాట్ ఫామ్స్ లో రుసుముల భారాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది., డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మార్గాలను మాత్రమే ఎంచుకోవచ్చు. యాక్సిస్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకూ ఈ రూల్ వర్తిస్తుంది. ఇతర ప్లాట్ ఫామ్స్ ల ద్వారా ప్రీమియం చెల్లించినప్పిటికీ క్రెడిట్ కార్డులపై వచ్చే రివార్డ్ పాయింట్లు వస్తాయి. దీంతో ఇక కో బ్రాండ్ క్రెడిట్ కార్డులతో ప్రయోజనమేంటని సోషల్ మీడియాల్లో క్రెడిట్ కార్డు యూజర్లు పోస్టులు పెడుతున్నారు.క్రెడిట్ కార్డుల ద్వారా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించినప్పుడు బ్యాంకులు, పేమెంట్ గేట్ వేలు కొంత ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తాయి. గతంలో ఈ ఛార్జీలను వినియోగదారులపై పడకుండా ఎల్ఐసీనే భరించేది. కానీ, ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఆ ఆప్షన్ పూర్తిగా తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఎల్ఐసీ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్ ల ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ఉచితంగా ప్రీమియం కట్టవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తోనే లాగిన్ అయ్యి సురక్షితంగా పేమెంట్ చేయవచ్చు.