బిహార్‌లోని బంకీపూర్ శాసనసభ ఉప-ఎన్నికల్లోనామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నికల అఫిడ్‌విట్‌లో తన ఆస్తుల విలువ రూ. 96 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ. 22.19 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 73.87 కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు. అసోంకి చెందిన వైద్యురాలైన ఆయన భార్య జాహ్నవి దాస్‌కు పీకే కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆమె పేరుతో మొత్తం రూ. 101.73 కోట్లు విలువైన ఆస్తులు ఉండగా... వీటిలో రూ. 89.51 కోట్లు చరాస్తులు, రూ. 12.42 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.రాజీనామాతో అక్కడ ఉప-ఎన్నిక జరుగుతోంది. బీజేపీకి కంచుకోటగా గుర్తింపు పొందిన ఈ నియోజకవర్గంలో మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా తొలుత నామినేషన్ వేసి అభిషేక్ కుమార్ అలియాస్ ‘బంటీ’ పోటీ నుంచి వైదొలగడంతో ఆ పార్టీ యువమోర్చా నేత 32 ఏళ్ల నీరజ్ కుమార్‌ను పోటీకి నిలిపింది.‘‘ఇది కేవలం నా 'నామినేషన్' మాత్రమే కాదు, బీహార్‌లో రాజకీయ మార్పు కోసం ఇస్తున్న పిలుపు. నేర చరిత్ర ఉన్నవారు తమ కుర్చీలను వదులుకోవాలి’’ అని ప్రశాంత్ కిషోర్ సోమవారం అన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు.. ఆయన సోన్‌పూర్‌లోని బాబా హరిహరనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పట్నాలోని సిన్హా లైబ్రరీ సమీపంలో ఉన్న స్కౌట్ గైడ్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు.2021 బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. 2022 అక్టోబరు 2న తాను ఇకపై ఇతర రాజకీయ పార్టీల కోసం ఎన్నికల వ్యూహాలను రూపొందించబోనని ప్రకటిస్తూ.. జన్ సూరజ్ అభియాన్‌ను ప్రారంభించి తన సొంత రాష్ట్రం బిహార్‌లో పాదయాత్ర చేపట్టారు. గతేడాది నవంబరులో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అప్పుడు పోటీకి దూరంగా ఉన్న పీకే.. ఈ ఉప ఎన్నికతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు.ప్రశాంత్ కిషోర్ తన పేరున బ్యాంకు రుణం రూ. 5.77 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. తన భార్య జాహ్నవికి గౌహతిలో రెండు ఫ్లాట్లు, ఒక బంగ్లాలో మూడో వంతు వాటాతో పాటు నోయిడాలో అదనపు ఆస్తులు కూడా ఉన్నాయి. ఆయనకు స్వయంగా ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50% వాటా ఉన్నాయి. అంతేకాకుండా, పట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్‌లలో ప్లాట్లు, బక్సర్, తన పూర్వీకుల గ్రామంలో ఆస్తులు కూడా ఆయనకు సొంతంగా ఉన్నాయి.అంతేకాదు, ఆయన వేధా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు యజమాని కాగా.. ఈ సంస్థ 2023-24లో జన్ సూరజ్ ఫౌండేషన్‌కు రూ. 50 లక్షలు, జాయ్ ఆఫ్ గివింగ్‌కు రూ. 2.75 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇక, 2024-25లో జన్ సూరజ్‌కు రూ. 85 కోట్లు విరాళంగా అందజేసింది.పరువు నష్టం, అధికార విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలతో ఎనిమిది కేసులు నమోదయ్యాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ కేసుల్లో దేనిలోనూ ఇంకా అభియోగాలు నమోదు కాలేదు. విద్యార్హతలకు వస్తే లక్నో యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) నుంచి మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేశారు. ఫ్రెంచ్ భాషలో సర్టిఫికేషన్ కోర్సు కూడా చేసినట్టు అఫిడ్‌విట్‌లో వెల్లడించారు.