భారత క్రికెట్‌ మోడ్రన్ డే లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సరికొత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే ద్వారా టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలిసి ఆడిన మొట్టమొదటి జోడీగా రో-కో నిలిచారు. ప్రతి ఏటా ఎంతో మంది యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులోకి వస్తూ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, తమ అసాధారణ నైపుణ్యం, ఫిట్‌నెస్‌తో ఈ అరుదైన రికార్డును సాధించారు.ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకోవడానికి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ద్వయం భారత మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును అధిగమించింది. సచిన్, ద్రవిడ్ తమ కెరీర్‌లో కలిసి మొత్తం 391 అంతర్జాతీయ మ్యాచ్‌లలో టీమిండియా తరఫున మైదానంలోకి దిగారు. ఇన్నాళ్లూ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన జోడీగా ఉన్న వీరిని రోహిత్-కోహ్లీలు వెనక్కి నెట్టారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన ప్రపంచ ఆటగాళ్ల ఓవరాల్ జాబితాలో ఈ జోడీ ఆరో స్థానానికి చేరుకుంది.అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు కలిసి ఆడిన ప్లేయర్లు ఎవరంటే..కుమార సంగక్కార, మహేల జయవర్దనే - 550 మ్యాచ్‌లుతిలకరత్నే దిల్షాన్, మహేల జయవర్దనే - 426 మ్యాచ్‌లుకుమార సంగక్కార, తిలకరత్నే దిల్షాన్ - 418 మ్యాచ్‌లుసనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్ - 408 మ్యాచ్‌లుజాక్వస్ కల్లిస్, మార్క్ బౌచర్ - 407 మ్యాచ్‌లురోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ - 400 మ్యాచ్‌లుసచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ - 391 మ్యాచ్‌లుసనత్ జయసూర్య, చమిందా వాస్ - 391 మ్యాచ్‌లులార్డ్స్ వన్డే మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 561వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా, రోహిత్ శర్మకు ఇది 513వ మ్యాచ్. ఈ గణాంకాలను పరిశీలిస్తే వీరిద్దరూ తమ సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 70 శాతానికి పైగా మ్యాచ్‌లు కలిసి ఆడారు.