ఆంధ్రప్రదేశ్‌కు గుండెకాయ లాంటి విశాఖపట్నంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీసీ ఆర్టీసీ తొలిసారి ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను తీసుకొస్తోంది. విడతలవారీగా 100 బస్సులు విశాఖ రోడ్లపై నడవనున్నాయి. తొలి దశలో 20వ తేదీకి నాలుగు కూర్మన్నపాలెం చేరుకున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి రాకపోకలు సాగించే వారి కోసం అధికారులు వీటిని కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ పెడితే ఒక్కో బస్సు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక్కో ఎలక్ట్రికల్ ఏసీ బస్సులో 40 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ కాలుష్య రహితం కావడంతో పర్యావరణానికి కూడా హాని లేకుండా ఉంటుంది. ఇంజిన్ల నుంచి వచ్చే భారీ శబ్దాలు కూడా ఇకపై వినిపించవు. దాంతో రోడ్ల మీద నుంచి ప్రయాణించే వారికి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. బస్సు లోపల ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఉండేందుకు అత్యాధునిక తలుపులు కూడా ఏర్పాటు చేశారు. లోపల సీసీ కెమెరాలు, బస్సు స్టేజ్ వచ్చినప్పుడు చెప్పేందుకు ప్రత్యేకమైన మైకు కూడా ఏర్పాటు చేశారు. READ ALSO భోగాపురం ఎయిర్‌పోర్టుకు నగరం నుంచి రెండు మార్గాల్లో భోగాపురం చేరుకోనున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం ప్రత్యేకమైన లాంజ్‌లను జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనుంది. గాజువాక నుంచి బయల్దేరి ఎన్‌ఏడీ కూడలి, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక, మధురవాడ, ఆనందపురం, తగరపువలస మీదుగా భోగాపురానికి పది బస్సులు నడపనున్నాయి. గాజువాక, సింధియా, రైల్వేషన్, ద్వారకా బస్ స్టేషన్, వుడా పార్కు, రుషికొండ, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా భోగాపురం చేరుకోవడానికి మరో పది బస్సులను నడపనున్నారు. తొలి దశలో 20 బస్సులు నడపనున్నారు. విశాఖ నగరానికి మిగిలిన 80 బస్సులను కేవలం నగరంలోనే కాకుండా, నగరం బయట తిప్పేలా కూడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలమంచిలి, అనకాపల్లి, విజయనగరం తిప్పనున్నారు. వాటిలో ఛార్జీలు ఎలా ఉంటాయి, ఏంటి అనేది త్వరలోనే ఆర్టీసీ యాజమాన్యం తెలపనుంది. అయితే, ఈ బస్సులు ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్లే నడుపుతారని.. ఆర్టీసీకి చెందిన కండక్టర్లు టికెట్లు ఇవ్వనున్నారు.