Tirupati: బ్లాక్‌మనీ ఇస్తానంటూ.. పిల్లలు ఆడుకునే నోట్లు ఇచ్చిన కేటుగాళ్లు, కత్తుల వరకూ వెళ్లడంతో అరెస్ట్

Wait 5 sec.

ఒకనోటుకు ఐదు నోట్ల ఇస్తానని చెప్పడంతో అతను ఆశపడ్డాడు. డీల్ ఇంట్లోనే పెట్టుకుందాం అనేసరికి పని ఈజీగా అయిపోతుంది అనుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత బ్లాక్ మనీకి బదులు పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను బ్లాక్ మనీగా చూయించారు. అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా కత్తులతో బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన అజ్మీరా రాజారామ్‌కు బ్లాక్ మనీ ఇస్తామని పిచ్చాటూరుకు చెందిన ప్రకాశ్ నమ్మబలికాడు. అసలు కరెన్సీ ఇస్తే తనకు బ్లాక్ మనీ రూపంలో ఐదు రెట్లు ఇస్తానని చెప్పడంతో రాజారామ్ ప్రకాశ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ పిల్లలు ఆడుకునే టాయ్ కరెన్సీని చూయించి ఇదే బ్లాక్ మనీ అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేశాడు. అది పసిగట్టిన రాజారామ్ అక్కడ నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. READ ALSO రాజారామ్‌ను అడ్డుకున్న ప్రకాశ్ మరికొంత మంది ఇంటి తలుపులు మూసేసి కత్తులతో బెదిరించారు. ఆ సమయంలో రాజారామ్ దగ్గర ఉన్న రూ. 20 వేల నగదును బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిన రాజారామ్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ నెల 18న మధ్యాహ్నం పిచ్చాటూరు మండలం క్రాస్ సమీప ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులు ఉన్నారన్న సమాచారం తెలుసుకుని, అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ప్రకాశ్, మురళి, షేక్ అబ్దుల్ అక్రమ్, పల్లపు రవి కుమార్, కర్రేటి ప్రణయ్ ఉన్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రకాశ్ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 50 బండిళ్ల టాయ్ కరెన్సీ నోట్లు, నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.