పసిడి ప్రియులకు ఊరట- భారీగా తగ్గి స్థిరంగా బంగారం, వెండి ధరలు- అక్కడ మాత్రం పతనం

Wait 5 sec.

భారతీయులకు బంగారంపై ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలే బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఏదైనా పండగ ఉన్నా, పెళ్లి ఉన్నా, ఇతర వేడుక ఏదైనా కచ్చితంగా బంగారం కొనాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఇంకా ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపే సమయంలో కూడా తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం పెట్టి సాగనంపుతుంటారు. అంతలా బంగారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. బంగారం ఒక్కటే కాదు వెండికి కూడా డిమాండ్ ఇదే రీతిలో ఉంటుంది. ఇంకా వీటిని కేవలం అలంకరణ ఆభరణాలుగానే కాదు పెట్టుబడికి సాధనంగా కూడా ఉపయోగిస్తుంటారు. ఇటీవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగింది. గతేడాది బంగారం, వెండి రేట్లు రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. బంగారం ధర ఏకంగా 70 శాతం పెరగ్గా, ఇదే సమయంలో వెండి ధర 150 శాతం పుంజుకుంది. ఇంకా కొండెక్కుతాయనుకుంటే ఈ ఏడాది మాత్రం జనవరి చివర్లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో పడిపోతూ వచ్చాయి. తర్వాత అమెరికా- ఇరాన్ భీకర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరగ్గా బంగారం ఆకర్షణ కోల్పోయింది. ధర తగ్గుతూ వచ్చింది. Also Read: మధ్యలో మళ్లీ ఒడుదొడుకులకు లోనైంది. యుద్ధం కాస్త శాంతించినా బంగారం ధర పెరగడం, మళ్లీ కాస్త ఉద్రిక్తతలు చెలరేగినా బంగారం ధర పడిపోవడం ఇదే జరుగుతూ వచ్చింది. అయితే తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదిరి ఇటీవల ఉల్లంఘనలతో మళ్లీ దాడులు పెరుగుతుండటంతో బంగారం ధర వరుసగా తగ్గుతోంది. గత వారం భారీగా తగ్గగా ఇప్పుడు సోమవారం రోజు మాత్రం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇప్పుడు 4 వేల డాలర్ల దిగువకు చేరింది. సిల్వర్ రేటు 56.60 డాలర్ల స్థాయిలో ఉంది.Also Read: భారత్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 1,31,350 వద్ద ఉంది. దీనికి ముందు జులై 13, 14 తేదీల్లో వరుసగా రూ. 1300, రూ. 100 మేర తగ్గగా జులై 15న స్వల్పంగా పెరిగింది. 16, 17 తేదీల్లో మళ్లీ రూ. 250, రూ. 700 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,43,290 వద్ద ఉంది. బంగారం ధర ఇలా ఉండగా సిల్వర్ రేటు కేజీకి హైదరాబాద్ మార్కెట్లో రూ. 2.35 లక్షలు పలుకుతోంది.