ట్యాక్స్ పేయర్లూ.. జులై 31లోపు ఈ పత్రాలు సరిచూసుకోకపోతే ఐటీ నోటీసులు గ్యారెంటీ!

Wait 5 sec.

ITR Filing: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అత్యంత కీలకమైన సమయం వచ్చేసింది. అసెస్మెంట్ ఇయర్ 2026- 27కు సంబంధించి ఐటీఆర్- 1, ఐటీఆర్- 2 దాఖలు చేసేందుకు జులై 31, 2026 ఆఖరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. చివరి రోజుల్లో సర్వర్లు నెమ్మదించడం, సాంకేతిక సమస్యలు రావడం సహజం కాబట్టి, ముందే ఫైలింగ్ పూర్తి చేయడం ఉత్తమం. అయితే, ముఖ్యమైన పత్రాలను ముందే సరిచూసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఫారమ్ 16, 26AS, AIS తనిఖీపని చేస్తున్న కంపెనీ యాజమాన్యం జారీ చేసే ఫారమ్ 16 (Form 16)లోని వివరాలను, ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ లో ఉండే ఫారమ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లతో క్రాస్ చెక్ చేసుకోవాలి. జీతం, కట్ అయిన టీడీఎస్ వివరాలు మూడింటిలోనూ ఒకేలా ఉన్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.బ్యాంక్ స్టేట్‌మెంట్లు తనిఖీమీకు ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లను దగ్గర పెట్టుకోవాలి. సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చిన వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన ఆదాయ వివరాలను ఐటీఆర్‌లో కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. పెట్టుబడులు, డిడక్షన్ల ఆధారాల తనిఖీ చేసినా, సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ వడ్డీ వంటి వాటిపై పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేస్తుంటే వాటికి సంబంధఇంచిన అన్ని పెట్టుబడి ఫ్రూఫ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.వెరిఫై చేసి సబ్మిట్ చేయాలిఅన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత ఐటీఆర్ ఫామ్ ఒకటికి రెండు సార్లు ప్రివ్యూ చూసి, ఈ-వెరిఫై చేసిన తర్వాతే సబ్మిట్ చేయాలి. ఐటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇ-వెరిఫికేషన్ చేయకపోతే మీ ఐటీఆర్ చెల్లదు. జులై 31వ తేదీ గడువు దాటితే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ సందర్శించి మీ ఐటీఆర్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవాలి. రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉంటే రూ. 1000, ఆపైన ఆదాయం ఉన్నవారు రూ. 5000 వరకు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అలాగే పన్ను బకాయిలపై ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ సైతం చెల్లించాల్సి వస్తుంది.