ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు జమ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధిత కాల భృతి కింద ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం విడుదల చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. మత్యసకారుల బ్యాంక్ అకౌంట్‌లలో మొత్తం రూ.262 కోట్లు జమ చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు దాదాపు రెండు నెలలో పాటూ సముద్రంలో వేటకు మత్స్యకారులు విరామం ఇస్తారు. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కూటమి ప్రభుత్వం కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తోంది. . తాజాగా మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధిత కాల భృతిని రాష్ట్రంలో మరో 5,910 మంది మత్స్యకారులకు విడుదల చేశారు. ఈ మేరకు మొత్తం రూ.11.82 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,28,388 కుటుంబాలకు మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద రూ.256.77 కోట్లు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసినవారితో కలిపితే మొత్తంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి 1,34,298 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు అచ్చెన్నాయుడు. మత్స్యకారుల ఆర్థిక భద్రత, సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు.'అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల కన్నీళ్లు కనిపించలేదు... ఇప్పుడు పరామర్శల పేరుతో రాజకీయ ప్రదర్శనలా?. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి, మత్స్యకారులు నష్టపరిహారం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నప్పుడు పట్టించుకోని వైఎస్ జగన్ గారు, పరామర్శల పేరుతో వస్తే ఆ బాధితులు ఎలా నమ్ముతారు?. నాడు మత్స్యకారుల సమస్యలను గాలికొదిలేసి, నష్టపరిహారాలను పెండింగ్‌లో పెట్టిన మీ ప్రభుత్వం.. ఇప్పుడు కన్నీళ్లపై రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటు. నాడు న్యాయం చేయని మీరు, నేడు అండగా ఉంటానంటే ఆ మాటలకు విలువేముంది?. బాధితులకు ఓదార్పు మాటలు చెప్పే కంటే ముందు, నాడు మీరు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పాలి. కపట సానుభూతిని మత్స్యకార సోదరులు ఎప్పటికీ నమ్మరు' అంటూ ట్వీట్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో సముద్రంలో గల్లంతై 63 మంది మత్స్యకారులు చనిపోతే కనీసం బాధిత కుటుంబాల్ని పరామర్శించారా? అంటూ వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. వారందరికి కనీసం మరణ ధ్రువీకరణ పత్రాలూ ఇవ్వలేదని ఆరోపించారు.చాలామందికి నష్టపరిహారం అందక, పింఛన్లు రాక ఆర్థికంగా చితికిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 63 కుటుంబాలకు రూ.3.15 కోట్ల ఆర్థికసాయం అందించామన్నారు. గత ప్రభుత్వంలో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం సంభవించి 45 బోట్లు కాలిపోతే సీఎంగా ఉండి బాధితుల్ని జగన్‌ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సముద్రంలో బోటు మునిగి మత్స్యకారులు చనిపోతే శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శ పేరుతో కొత్త కుట్రకు తెర తీశారన్నారు.