ఐటీ ఉద్యోగులకు షాక్.. దిగ్గజ కంపెనీలో భారీగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య- అయినా ఒక గుడ్‌న్యూస్!

Wait 5 sec.

: భారత అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ఇటీవల క్యూ1 ఫలితాల సమయంలో శుభవార్తలు చెప్పింది. మంచి లాభం, ఆదాయం సాధించడంతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. వేతనాల పెంపు కూడా అమలైంది. డివిడెండ్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఐటీకి అంతా సానుకూలంగానే ఉంటుందని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. తాజాగా భారత మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్ని ప్రకటించగా లాభాదాయాల్లో వృద్ధి ఉన్నా మరోవైపు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. ఇది ఐటీ ఉద్యోగులకు, ఐటీలో చేరాలనుకుంటున్న ఔత్సాహికులకు నిరాశ కలిగించే ప్రకటన అని చెప్పొచ్చు.2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 3292 మంది తగ్గారు. గత 5 త్రైమాసికాల్లో చూసినా ఇదే అత్యధిక తగ్గుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,27,181 గా ఉండగా ఇప్పుడు అదే హెడ్ కౌంట్ జూన్ 30 నాటికి 2,23,889 కి పడిపోయింది. ఓవరాల్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గినా సమీక్షా త్రైమాసికంలో 1056 మంది ఫ్రెషర్లను చేర్చుకోవడం సానుకూలాంశం. ఇక 12 నెలల అట్రిషన్ రేటు (సిబ్బంది వలసలు) 12.7 శాతం వద్ద స్థిరంగా ఉంది. దీనికి ముందటి త్రైమాసికాల్లో చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్- డిసెంబర్) 261 మంది ఉద్యోగులు తగ్గగా, క్యూ4లో (జనవరి- మార్చి) ఉద్యోగుల సంఖ్య 802 పెరిగింది. ఇదిలా ఉండగా దీనికి భిన్నంగా ఇటీవల అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ ట్రెండ్ మార్చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా . ఫ్రెషర్లను ప్రాంగణ నియామకాల ద్వారా 3 నెలల కాలంలోనే 14 వేల మందికిపైగా ఎంపిక చేయడం మరో విశేషం. HCLTech Results:జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం రూ. 4624 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం 20 శాతం వరకు పెరగడం విశేషం. సంస్థ కార్యకలాపాల ఆదాయం చూస్తే 14 శాతం వరకు పెరిగి రూ. 34,579 కోట్లుగా నమోదైంది. ఏఐ వల్ల కొత్త వృద్ధి అవకాశాలు పెరుగుతున్నాయని సంస్థ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ పేర్కొన్నారు.Read Also: డివిడెండ్ ప్రకటన (HCLTech Dividend)ఇదిలా ఉండగా ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గినా కంపెనీ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ మధ్యంతర డివిడెండ్‌ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 12 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జులై 17 రికార్డ్ డేట్‌గా, జులై 27ను చెల్లింపుల తేదీగా నిర్ణయించింది. అంటే జులై 17 లోపు ఈ షేర్లు కలిగి ఉన్న వారు డివిడెండ్ పొందేందుకు అర్హులు. ఫలితాలకు ముందు సోమవారం సెషన్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 5 శాతానికిపైగా పెరిగి రూ. 1224 వద్ద స్థిరపడింది.