: కొంత కాలంగా టెలికాం దిగ్గజ కంపెనీలు క్రమంగా టారిఫ్స్‌ను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అధిక ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెప్పుకుంటూ రీఛార్జ్ ప్లాన్ ధరల్ని సవరిస్తూ వస్తున్నాయి. చివరిగా ఇక్కడ కస్టమర్లపైనే అధిక భారం పడుతోంది. 2024 లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సైలెంట్‌గా టారిఫ్స్ మార్చేస్తున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్స్ పెంచినా మరోవైపు భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రం టారిఫ్స్ పెంచకుండా ఇంకా కస్టమర్లను పెంచుకునే దిశగా ఆకర్షణీయ ప్లాన్స్ తీసుకొచ్చింది. ఆ మధ్య చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌వైపు మళ్లారు కూడా. దీంతో అప్పటి నుంచి ఈ ప్రభుత్వ సంస్థ కూడా క్రమంగా తన ఆదాయాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీనికి తగ్గట్లుగానే తాజా ఆర్థిక ఫలితాల్లోనూ బీఎస్ఎన్ఎల్ సత్తా చాటింది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1- ఏప్రిల్- జూన్) ఫలితాల్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం- బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాల ఆదాయం గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది.Read Also: అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 4017 కోట్లుగా ఉంటే ఇప్పుడు దాదాపు 10 శాతం పెరిగి రూ. 4418 కోట్లకు చేరుకుంది. దాదాపు రూ. 401 కోట్ల మేర ఆదాయం పెరిగిందన్నమాట. కన్జూమర్ మొబిలిటీ విభాగంలో ప్రైవేట్ పోర్టింగ్స్ వల్ల కస్టమర్లు పెరగడంతో వృద్ధి నమోదు చేసింది. ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ చూస్తే కార్పొరేట్ సేవల విస్తరణతో వృద్ధి పథంలోనే ఉంది.ఇదీ చూడండి: ఇక ఆదాయానికి అత్యంత కీలకమైన ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) కూడా పెంచుకుంది. ఇది ఒక్కో యూజర్/కస్టమర్ నుంచి నెలవారీగా పొందే సగటు ఆదాయంగా చెబుతారు. అంతకుముందు ఇదే సమయంలో ఆర్పు రూ. 100 గా ఉండగా ఇప్పుడు అది రూ. 102.7 కు చేరింది. ఇక్కడ ప్రధానంగా తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుండటంతో కస్టమర్లు లాంగ్ టర్మ్ ప్లాన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా స్వదేశీ పరిజ్ఞానంతో బీఎస్ఎన్ఎల్ దేశంలో వేగంగా ఏర్పాటు చేస్తున్న 4G నెట్‌వర్క్ టవర్లు కూడా కస్టమర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా భావిస్తున్నారు. ఇక ఆర్పు విషయంలో భారతీ ఎయిర్‌టెల్ అన్నింటికంటే ముందుంది. లేటెస్ట్ డేటా ప్రకారం ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ. 257.2 గా ఉండగా, జియోకు రూ. 214 గా ఉంది. వొడాఫోన్ ఐడియా ఆర్పు చూస్తే రూ. 174 గా ఉంది.