హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్లకు తీపికబురు.. ఏసీ రెస్ట్ రూములు ఏర్పాటు, ఈ ఏరియాల్లోనే

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్లకు తీపికబురు చెప్పింది.. వారి కోసం ఏసీ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లో గిగ్‌ వర్కర్ల పని వాతావరణం మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల కోసం మొత్తం ఐదు ప్రత్యేక విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అమెజాన్‌ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. సీఎస్‌ఆర్‌ కింద ఈ విశ్రాంతి కేంద్రాలను ‘ఆశ్రయ్‌’ పేరుతో ఏర్పాటు చేయనున్నారు.. అక్కడ ఆయా సంస్థలకు చెందిన గిగ్‌ వర్కర్లు హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు. హైదరాబాద్‌లోని కొండాపూర్, చందానగర్‌, పటాన్‌చెరు, తెల్లాపూర్, భారతీనగర్ ప్రాంతాల్లో ఈ ఏసీ విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏసీ విశ్రాంతి కేంద్రాలపే అమెజాన్‌ ఇండియా ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అమెజాన్ సంస్థ 250 ఏసీ విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. గిగ్‌ వర్కర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఈ ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ గుర్తిస్తుంది, గౌరవిస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గిగ్ వర్కర్ల శ్రమ, కృషి కారణంగానే సమాజం, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వానికి గిగ్‌ వర్కర్లు ఎంతో ముఖ్యమైన వారన్నారు.. అందుకే వారి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెజాన్ ఇండియాతో కలిసి ఈ ఆశ్రయ్ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తు్న్నామన్నారు. గిగ్ వర్కర్లు కొద్దిసేపు అలా విశ్రాంతి తీసుకోవడానికి, ఉపశమనం పొందడానికి వీలుగా ఉంటుందన్నారు. విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న అమెజాన్ ఇండియాను ముఖ్యమంత్రి అభినందించారు. గిగ్‌ వర్కర్ల డిజిటల్‌ ఎకానమీని ముందుకు నడిపిస్తున్నారని.. వాళ్ల కారణంగానే ఆధునిక జీవనం అందరికీ సజావుగా సాగుతుందన్నారు.హైదరాబాద్ భవన నిర్మాణాలకు అవసరమైన ఫైర్ ఎన్వోసీను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఈ మేరకు సరికొత్త ప్రక్రియను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ప్రారంభించారు. కొత్త ఎన్వోసీలతో పాటు, ఇప్పటికే జారీ చేసిన ఎన్వోసీల పునరుద్ధరణ కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడం, పరిశీలన, ఎన్వోసీల జారీలో ఆలస్యాన్ని నిరోధించేందుకు ఈ సేవలు ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు.