Tirupati: విదేశాల్లో భర్త.. ఆరేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారితో పరిచయం.. ఇచ్చిన డబ్బు తిరిగి అడగడంతో మర్డర్ ప్లాన్!

Wait 5 sec.

ఆమె భర్త విదేశాల్లో పని చేస్తుంటాడు. ఆమె మాత్రం ఇద్దరు పిల్లలతో ఉంటుంది. ఇదే సమయంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విడతల వారీగా రూ. 46 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసరికి ఆ వ్యాపారికి కోపం వచ్చింది. అసలు ఆమే లేకపోతే తనను ఆ డబ్బులు అడిగేవారే ఉండరుగా అని.. పట్టపగలే మర్డర్ ప్లాన్ చేశాడు. కానీ, ఆమె తప్పించుకోవడంతో ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన నగర శివారుల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైకుంఠపురం ఆర్చి సమీపంలో 38 సంవత్సరాల హిమబిందు అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమె భర్త మొహమ్మద్ షరీఫ్ ఉపాధి నిమిత్తం ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. అయితే, సోమవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో హిమబిందు ఆటోలో వైకుంఠపురం నుంచి జీవకోనకు వెళ్తుంది. అదే సమయంలో చెర్లోపల్లెకు చెందిన ఆకాశ్ కారులో వచ్చి ముత్యాలరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఆటోను అడ్డగించాడు. READ ALSOఆకాశ్ తన వెంట తెచ్చుకున్న కొడవలితో హిమబిందుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆమె వేళ్లు, మెడ, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. హత్య చేస్తాడని అనుకున్న హిమబిందు ఆటో నుంచి దిగి సమీపంలో ఉన్న ఓ హోటల్‌లోకి పరిగెత్తింది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోగానే ఆకాశ్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన హిమబిందును తొలుత స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి, ఆ తర్వాత రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిమబిందు దగ్గరకు చేరుకున్న పోలీసులు ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. హిమబిందు - ఆకాశ్‌కు ఆరేళ్లుగా పరిచయం ఉందని, విడతల వారీగా రూ. 46 లక్షలను హిమబిందు ఆకాశ్‌కు ఇచ్చిందని, ఇప్పుడు ఆ డబ్బు తిరిగి అడిగినందుకే హత్య చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆకాశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.