రైళ్లలో ప్రయాణిస్తూ జనం మరీ ఇంతకు తెగిస్తున్నారా? రైల్వేకు వందల కోట్ల లాస్.. అసలేం జరిగిందంటే?

Wait 5 sec.

: భారతదేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల కోసం, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు, తీర్థ యాత్రలకు, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్లకు వెళ్లాలంటే మొదటి ఆప్షన్ రైలు ప్రయాణమే. అయితే ఇందుకోసం టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటుంటారు. ఇందులో భాగంగానే ఏసీ కోచ్‌లు కూడా బుక్ చేస్తుంటారు. అయితే ఇదే సమయంలో ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించే కొందరు ప్రయాణికులు దారుణంగా చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. రైల్వే శాఖ అందించే బెడ్‌రోల్స్‌ను (దుప్పట్లు, టవల్స్) విచ్చలవిడిగా అపహరిస్తున్నారంట. ఒక ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం- 2022 జనవరి నుంచి 2026 మే మధ్య కాలంలో దాాదాపు 1.27 కోట్ల బెడ్ వస్తువులు మాయమయ్యాయి. దీని వల్ల రైల్వే కాంట్రాక్టర్లకు రూ. 104 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ప్రతి 1000 మంది ప్రయాణికుల్లో ఒకరు ఈ వస్తువుల్ని దొంగిలిస్తున్నట్లు లెక్క తేలింది. గత నాలుగేళ్లలో చూస్తే ఫేస్ టవల్స్ (తువ్వాళ్లు) ఏకంగా 46.54 లక్షలు మాయమయ్యాయి. సైజు చిన్నగా ఉండటం వల్ల ఈజీగా బ్యాగుల్లో దాచేస్తున్నారు. బెడ్‌షీట్స్ (దుప్పట్లు) 41.13 లక్షల మేర మిస్ అయ్యాయి. వీటిని నిత్యం ఇంట్లో వాడుకునేందుకు వీలుగా ఉంటుందని పట్టుకెళ్తున్నారు. 23.59 లక్షల మేర పిల్లో కవర్స్ మిస్ అయ్యాయి. ఇంకా 12.95 లక్షల బ్లాంకెట్స్ చలికాలం వాడుకోవడానికి కొట్టేస్తున్నారు. పిల్లోస్ (దిండ్లు) 2.76 లక్షల మేర కాజేశారు. దీని సైజు కాస్త పెద్దది కాబట్టి తక్కువగా చోరీ అయ్యాయి.Read Also: దేశవ్యాప్తంగా మొత్తం 54 రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే అత్యధికంగా ఈ దొంగ తనాలు జరిగిన నగరాల్లో రాజస్థాన్ బికనేర్ టాప్‌లో ఉంది. 25.76 లక్షల వస్తువులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తర్వాత రాంచీ (ఝార్ఖండ్)- 9.31 లక్షల వస్తువులు, ఢిల్లీ- 8.21 లక్షల వస్తువులు, ముంబై- 8.17 లక్షల వస్తువులు, జోధ్‌పుర్- 8.09 లక్షల వస్తువులు వరుసగా ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి తర్వాత 2022లో బెడ్ రోల్ సేవలు మళ్లీ మొదలవగా, 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ దొంగ తనాలు 56 శాతం మేర పెరగడం గమనార్హం. ఈ దొంగ తనాల వల్ల వచ్చే నష్టాల్ని రైల్వే బోర్డు- కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి కట్ చేస్తుండటంతో వారు కోచ్ అటెండెట్ల జీతాల్లో కోతలు పెడుతున్నారు. ఇక ఈ చోరీ అంశాన్ని రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.