ఏపీలో స్కూల్ విద్యార్థులకు పూర్తిగా ఉచితం.. నేటి నుంచే, త్వరపడండి.. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డులో వివరాలు ఒకే విధంగా ఉండాలి. అపార్ ఐడీ నమోదుతో పాటుగా ఏదైనా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటే ఆధార్ చాలా కీలకం. విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలి. అందేకే ప్రభుత్వం విద్యార్థుల ఆధార్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించింది. స్కూళ్లలో 5 నుంచి 17 ఏళ్ల మధ్య విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 14 నుంచి 17 తేదీ వరరకు తొలి విడతగా.. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు రెండో విడతగా పాఠశాలల్లో స్పెషల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సిబ్బందిని ఈ ఆధార్ స్పెషల్ సెంటర్లకు కేటాయిస్తారు.. వీరు ఆధార్ అప్డేట్ చేస్తారు.గతేడాదది కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలుసార్లు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్‌ సెంటర్లు నిర్వహించి బయోమెట్రిక్‌ అప్డేట్ చేశారు. కానీ ఇంకా చాలా మంది విద్యార్థులు వివరాలు అప్డేట్ చేసుకోకుండా మిగిలిపోయారు. వారందరికి ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది.. నేటి నుంచి ఆధార్ స్పెషల్ సెంటర్లు ప్రారంభం అయ్యాయి. విద్యాశాఖ భవిష్యత్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావిస్తోంది.. అందుకే ఈ ప్రక్రియను చేపట్టింది. అంతేకాదు విద్యార్థులు చేతి వేలి ముద్రలు కూడా మారుతుంటాయి.. అందుకే అప్డేట్ చాలా అవసరం అంటున్నారు అధికారులు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధిపొందాలన్నా ఆధార్‌ అప్డేట్ చేసుకోవాలి. ఐదేళ్లు నిండినవారికి తొలిసారి, 15-17 ఏళ్ల మధ్య వారికి రెండో సారి ఆధార్‌ అప్డేట్ చేయనున్నారు. స్కూల్ విద్యార్థులు ఆధార్‌ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న ఆధార్‌ కార్డు తీసుకెళ్లాలి. అలాగే కొత్తగా నమోదు చేయించుకోవాల్సిన డేట్ ఆఫర్ బర్త్ డే సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో చేర్పులు, మార్పులకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, పదో తరగతి మార్కుల జాబితా, అడ్రస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని.. స్కూల్లోనే ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వాస్తవానికి గతేడాది కూడా ఇలాగే స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించారు.. అయినా సరే చాలామంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోలేదు.. అందుకే మరోసారి ఈ అవకాశాన్ని కల్పించనున్నారు.