"పవన్ కళ్యాణ్ ముద్రగడకు గవర్నర్ పదవి ఇప్పిద్దామన్నారు": నాదెండ్ల మనోహర్

Wait 5 sec.

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత తెలిసిందే. స్వగ్రామం కిర్లంపూడిలో ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మరణం నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు.. ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి, జనసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభానికి గవర్నర్ పదవి సిఫార్సు చేద్దామని చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ గుర్తు చేసుకున్నారు. కైకలూరులో జరిగిన జనసేన చర్చావేదిక కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. 2024 ఎన్నికలకు ముందు జరిగిన సంగతులను ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం మరణవార్త తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్‌లో మాట్లాడుకుని. నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీ నేతలు సంప్రదించారని.. జనసేనలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. అందరం కలిసి ప్రయాణిస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ముద్రగడను జనసేనలోకి ఆహ్వానించారని.. ఈ చర్చలలో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవి వచ్చేలా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముద్రగడ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోవడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగింది. నాదెండ్ల మనోహర్ చెప్పినట్లుగానే జనసేన నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం జనసేనలో చేరలేదు. అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ కండువా కప్పుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌కు పోటీగా వైసీపీ తరుఫున పోటీ చేసిన వంగా గీతను గెలిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసిన ముద్రగడ.. మాట ప్రకారం పవన్ కళ్యాణ్ విజయం అనంతరం మార్చుకున్నారు. అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పేరు మార్చుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.