ఇన్సూరెన్స్ కొనుగోలులో మారుతున్న ఆలోచన.. ఆ ఒక్క పనితో 70 శాతం వరకు ప్రీమియం ఆదా.. పాలసీబజార్ కీలక రిపోర్ట్..!

Wait 5 sec.

Insurance Buying Trends: భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం వేగంగా డిజిటలైజ్ అవుతోంది. గతంలో ఏజెంట్లు చెప్పిన పాలసీలను గుడ్డిగా నమ్మి కొనే కస్టమర్లు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారమ్‌ల సాయంతో మార్కెట్లోని వివిధ ఆప్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను పోల్చి చూసుకుని ప్రీమియం తక్కువ ఉండి, మంచి కవరేజీ ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు. 50 శాతం నుంచి 70 శాతం వరకు వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ తరుణంలో ప్లాన్లను పోల్చి చూడడం వల్ల కస్టమర్లకు సగటున 70 శాతం వరకు ప్రీమియం భారం తగ్గుతోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకారం ఆరోగ్య బీమా కొనుగోలు చేసే వారిలో దాదాపు 75 శాతం మంది కస్టమర్లు కనీసం 3 ప్లాన్లను పోల్చి చూస్తున్నారు. ఒకే రకమైన ప్రొఫైల్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో గరిష్ఠంగా 70 శాతం వరకు ఆదా అవుతోంది. ఉదాహరణకు ముగ్గురు ఉన్న యువ కుటుంబానికి రూ.10 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ప్రీమియం నెలకు రూ.773 నుంచి రూ.2,426 వరకు మారుతోంది. దాదాపు 68 శాతం వ్యత్యాసం ఉంటోంది. 28-45 ఏళ్ల వయసు గల కుటుంబాలు ఎక్కువగా పాలసీలను పోల్చి చూసి కొనుగోలు చేస్తున్నాయి. రూమ్ రెంట్ లిమిట్స్ వంటి ఫీచర్లను అడ్జస్ట్ చేసుకుంటూ బడ్జెట్‌కు తగిన ప్లాన్ ఎంచుకుంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కొనేముందు 3 లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లను పోల్చే వారి సంఖ్య 2023లో 32 శాతంగా ఉండగా ఇప్పుడు అది 40 శాతం పైగా పెరిగింది. ఒకే రకమైన ప్రొఫైల్ ఉన్న వారికి ప్రీమియంలో 50 శాతం నుంచి 60 శాతం వరకు వ్యత్యాసాలు ఉన్నాయి. 30 ఏళ్ల ఉద్యోగి రూ.1 కోటి కవరేజ్ కోసం చూస్తే నెలవారీ ప్రీమియం రూ.635 నుంచి రూ.958 (50 శాతం పైగా తేడా) వరకు మారుతోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ధరతో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది కస్టమర్ల నిర్ణయాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తోంది. కస్టమర్లు తక్కువ మార్జినల్ ధరలోనే ఎక్కువ కవరేజ్ వస్తుందని గమనించినప్పుడు పెద్ద మొత్తాల కవరేజ్ కు మొగ్గు చూపుతున్నారు. మోటార్ ఇన్సూరెన్స్మోటార్ ఇన్సూరెన్స్ విభాగాల్లో ప్లాన్లను పోల్చి చూడడం వల్ల పాత వాహనాలపై సగటున రూ.8000, కొత్త వాహనాలపై ఏకంగా రూ.30 వేల వరకు ప్రీమియం ఆదా అవుతోంది. దాదాపు 70-75 శాతం మంది కస్టమర్లు కొనుగోలుకు ముందు 3 ప్లాన్లను పరిశీలిస్తున్నారు. కస్టమర్లు జీరో డెప్రిసియేషన్, ఇంజిన్ ప్రొటెక్ట్, ఇన్‌వాయిస్ కవర్ వంటి యాడ్ ఆన్స్ కోసం కొంచెం అదనంగా చెల్లించేందుకు సిద్ధపడుతుండగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్, కీ లాక్ కవర్ వంటి వాటిని వదులుకుంటూ బడ్జెట్ ప్రీమియంలను సాధిస్తున్నారు. మెట్రో నగరాల యూజర్లు వన్- క్లిక్ రెన్యూవల్స్ కోరుకుంటుండగా టైర్ 2/3 నగరాల యూజర్లు సేవింగ్స్ విజువలైజేషన్, వాట్సాప్ ఫాలో అప్‌లతో కూడిన అడ్వైజర్ సాయాన్ని కోరుకుంటున్నారు. కొనుగోలుదారుల ఆలోచన విధానంతొలిసారి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే వారిలో చాలా మంది ధరపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ప్రీమియం తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పోల్చి చూస్తున్నారు. ఇక రిపీట్ బయ్యర్స్ కేవలం ధరనే కాకుండా ఫీచర్లు, క్లెయిమ్స్ అనుభవం, యాడ్ ఆన్ రైడర్లు, కంపెనీ విశ్వసనీయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న నగరాల కస్టమర్లు ఎక్కువ సమయం కేటాయించి విస్తృతంగా ప్లాన్లను పోలుస్తారు. నిర్ణయం ప్రక్రియలో కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేస్తున్నారు. పాలసీ బజార్ ఫిన్‌టెక్ ఉమ్మడి గ్రూప్ సీఈఓ సర్బ్‌వీర్ సింగ్ ప్రకారం.. డిజిటల్ విధానంలో పాలసీలను పోల్చి చూడడం వల్ల సమాచార లోపం తొలగిపోయింది. కస్టమర్లు అన్ని ఆప్షన్లను ఒకే చోట చూడడం వల్ల ధరలపై స్పష్టత వస్తోంది. ఇది దీర్ఘకాలంలో బీమా కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచి, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరలోనే మెరుగైన ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రావడానికి దోహదం చేస్తుంది.