రెండో వారంలోనూ దుమ్ములేపుతున్న అయ్యగారు.. రూ.100 కోట్ల దిశగా ‘లెనిన్’.. 10 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Wait 5 sec.

‘లెనిన్’ సినిమాతో అఖిల్ అక్కినేని తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అభిమానులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న విజయాన్ని సాధించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి, అందరినీ లాభాల బాట పట్టించింది. రెండో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సందర్భంగా 10 రోజుల కలెక్షన్స్ వివరాలను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘లెనిన్’ సినిమా జులై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే రూ.16.7 కోట్ల భారీ గ్రాస్ రాబట్టి అఖిల్ కెరీర్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. హౌస్ ఫుల్స్ పడటంతో మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 67.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ డీసెంట్ నంబర్స్ సాధించిన అయ్యగారి సినిమా.. సెకండ్ వీకెండ్ లో భారీ వసూళ్లు అందుకుంది. వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో రూ.88 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కలెక్షన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండో వారాంతంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం 'లెనిన్' మూవీకి కలిసొచ్చింది. దాదాపు అన్ని ఏరియాలలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో రన్ అయింది. యూఎస్ఏలో $775K డాలర్లు రాబట్టింది. బుక్ మై షోలో ఒక మిలియన్ కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. డిస్ట్రిక్ యాప్ లోనూ టికెట్స్ బాగానే బుక్ అయ్యాయి. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే.. 'లెనిన్' మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే నాగచైతన్య తర్వాత అఖిల్ కూడా వంద కోట్ల హీరో అనిపించుకుంటారు. ఇదిలా ఉంటే, 'లెనిన్' టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడానికి రెడీ అయింది. ఈ రోజు(జులై 20) సాయంత్రం 6 గంటలకు 'బ్లాక్ బస్టర్ వైభవం' పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి , నాగ చైతన్య, అఖిల్ హాజరు కానున్నారు. అక్కినేని హీరోలు ముగ్గురూ చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకోబోతున్నారని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'లెనిన్' సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇందులో అఖిల్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ప్రదీప్ పంజు, ఈశ్వరీ రావు, రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ, గెటప్ శ్రీను, శరణ్య, పావని తదితరులు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.