ఇక 'ఇథనాల్' గ్యాస్‌తో వంట.. LPG సిలిండర్ల ధరకు చెక్.. కేంద్రం సంచలన ప్లాన్!

Wait 5 sec.

Ethanol Gas: దేశంలో మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ను శాసించే వాటిలో వంట గ్యాస్ (LPG) సిలిండర్ ధరలు ప్రధానమైనవి. అయితే, భవిష్యత్తులో ఈ ధరల భారం నుంచి సామాన్యుడికి పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోతున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే ఇథనాల్‌ను వంటగది ఇంధనంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా వంట ఖర్చులు భారీగా తగ్గుతాయని అంచనా వేస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.' ప్రత్యామ్నాయ స్వచ్ఛ వంట విధానం రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ విధానం ద్వారా ఎల్‌పీజీతో పాటుగా ఇథనాల్ సైతం వంట కోసం ప్రధాన ఇంధనంగా ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీని వల్ల దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగం పెరగడమే కాకుండా దిగుమతి చేసుకునే ఎల్‌పీజీపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ స్వచ్ఛ వంట గ్యాస్ పై ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో భాగంగా ఎల్‌పీజీతో పాటు ఇథనాల్ సైతం ప్రధాన వంట ఇంధనంగా గుర్తిస్తారు. ప్రస్తుతం దీనిపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఒక విధానాన్ని తయారు చేసి, విధి విధానాలు ఖరారు చేయవచ్చని సమాచారం. అయితే, ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయం దేశీయంగా చెరకు, తృణధాన్యాల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను వంటకు వాడడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగినా ప్రభావం పడదు. ఇథనాల్ వంటకు ఉపయోగించడానికి వీలుగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు ప్రత్యేకమైన ఎథనాల్ కుకింగ్ స్టవ్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది సాంప్రదాయ గ్యాస్ కంటే తక్కువ ప్రమాదకరమైనదిగా, పర్యావరణహితంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బయో ఇంధనానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇది దేశీయ వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిస్తుంది. రైతులకు ఉప ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రస్తుతం ప్రాథమిక, పైలట్ ప్రాజెక్ట్ దశల్లో ఉన్న ఈ ఇథనాల్ వంట ఇంధనం అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సబ్సిడీల భారం తగ్గి ప్రభుత్వ ఖాజానాకు కూడా మేలు జరుగుతుంది.