భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. చంద్రబాబు కీలక ప్రకటన

Wait 5 sec.

ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా భోగాపురంలోని జరగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఆగస్ట్ ఒకటిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని.. సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భోగాపురం విమానాశ్రయం, పర్యాటక ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమలతో ఉత్తరాంధ్ర ఇక అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తుందని చంద్రబాబు అన్నారు.మరోవైపు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం విమానాశ్రయం నిర్మించారు. భోగాపురం విమానాశ్రయం తొలి దశ పనులను 2,203 ఎకరాల్లో రూ.4750 కోట్ల వ్యయంతో చేపట్టారు. బోయింగ్, ఎయిర్ బస్ విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్ వే నిర్మించారు. 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25 వేల టన్నుల సరకును రవాణా చేసేలా కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు. 79 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు అంతస్తులలో ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించారు. భోగాపురం విమానాశ్రయంపై జీఎంఆర్ సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపించింది. ఎగిరే చేప ఆకృతిలో ఎయిర్ పోర్టు డిజైన్ చేసింది. ఇక విమానాశ్రయానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏడు రహదారులు నిర్మించారు. ఏసీ బస్సుల ద్వారా విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులను చేరవేసేలా చర్యలు చేపట్టారు. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రవాణాతోపాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వ్యవసాయ ఉత్పత్తులతో పాటుగా సముద్ర, పారిశ్రామిక ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు భోగాపురం ఎయిర్ పోర్టు గ్రోత్ ఇంజిన్‌లా మారనుంది. అలాగే ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు.