46 ఏళ్ల కిందట ఇదే జులై 18న.. విక్రమ్ 1 ప్రయోగానికి.. అబ్దుల్ కలామ్‌కి సంబంధం ఏంటి?

Wait 5 sec.

జులై 18, 2026 ఇది భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు. విజయవంతమైన రోజుగా ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, సరిగ్గా 46 ఏళ్ల కిందట ఇదే రోజున (18 జులై 1980) భారతదేశ తొలి స్వదేశీ శాటిలైట్ లాంచ్ వెహికల్ 'SLV-3', రోహిణి (RS-1) ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ విజయం భారతదేశాన్ని అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాల సరసన చేర్చింది. చారిత్రాత్మక ప్రయోగం అనంతరం సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ.. ఈ అంశాన్ని గుర్తుచేశారు.మిస్సైల్ మ్యాన్ కలాంకి నివాళిభారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచిన SLV-3కి, ఈ కి మధ్య ఉన్న సంబంధాలు కేవలం తేదీతోనే ముడిపడలేదు. నాటి SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ మన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వ్యవహరించడం విశేషం. విక్రమ్-1 ద్వారా స్కైరూట్ సంస్థ ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ రాకెట్‌లోని మూడు ఘన-ఇంధన దశలకు ఆయన జ్ఞాపకార్థం కలాం-1200, కలాం-250, కలాం-100 అని పేర్లు పెట్టడమే కాకుండా.. ఆయన సూక్ష్మ కళాఖండాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.‘‘భారతీయ అంతరిక్ష రంగాన్ని నిర్మించిన గొప్ప శాస్త్రవేత్తలను మనం ఎల్లప్పుడూ గౌరవించుకుంటాం.. డాక్టర్ అబ్దుల్ కలాం మా అందరికీ గొప్ప స్ఫూర్తి. విక్రమ్-1 రాకెట్ మొదటి మూడు దశలకు ఆయన పేరే పెట్టాం. అంతేకాకుండా, కొన్ని నెలల పాటు శ్రమించి సూది బెజ్జంలో చెక్కిన కలాం సూక్ష్మ ఆకృతిని కూడా అంతరిక్షంలోకి పంపాం... నాడు విజయవంతమైన మొదటి SLV-3 ప్రయోగం.. నేటి విక్రమ్-1 రెండూ ఒకే రోజు (జులై 18) జరగడం గొప్ప యాదృచ్ఛికం’’అని పవన్ కుమార్ చందన తెలిపారు. తామంతా గత కొన్ని రోజులుగా నిద్ర లేకుండా కష్టపడ్డామని, ప్రస్తుతం ఆ ఉత్సాహంలోనే ఉన్నామని, ఈ మైలురాయిని చేరుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పారు.భవిష్యత్ ప్రణాళికలుఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, స్కైరూట్ ఇప్పటికే తమ రెండు, మూడు, నాలుగు రాకెట్లకు సంబంధించిన వ్యవస్థల తయారీ ప్రక్రియను ప్రారంభించిందని పవన్ స్పష్టం చేశారు. ‘‘భారీ రాకెట్లను తయారు చేయడం స్కైరూట్ దీర్ఘకాలిక కల.. ఈ విషయంలో మేము మంచి పురోగతి సాధిస్తున్నాం. ఆ స్థాయికి చేరుకోవడానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు.. కానీ అది సాధ్యమైనప్పుడు అంతరిక్ష రంగానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.. భారత్ ఒక పెద్ద స్పేస్ హబ్‌గా మారుతుంది.. దీని కోసం మేము ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నాం.. తాజా ప్రయోగం మా భవిష్యత్ కార్యక్రమాలకు మరింత ఊతాన్ని ఇస్తుంది ఎందుకంటే అంతరిక్ష కక్ష్యను ఎలా చేరుకోవాలో ఇప్పుడు మాకు స్పష్టంగా తెలిసింది’’ అని సీఈఓ అన్నారు.‘‘మేము ఒదిగి ఉంటూనే ఆకాశమే హద్దుగా దూసుకెళ్తాం. రాబోయే రోజుల్లో అత్యధిక సంఖ్యలో రాకెట్ ప్రయోగాలు చేపట్టడమే మా లక్ష్యం. ఇది భారత్‌తో స్కైరూట్‌కు చాలా చాలా ముఖ్యం.. దీనిని మేము ఖచ్చితంగా నిజం చేసి చూపిస్తాం’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.