హెడ్‌క్వార్టర్స్‌లో సర్వీసు రివాల్వర్‌తో కాల్పుకుని త్రిపుర డీజీపీ ఆత్మహత్య

Wait 5 sec.

త్రిపుర డీపీజీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగుతోంది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన దన్ఖడ్ అగర్తలలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన తన సర్వీసు రివాల్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చికిత్స కోసం గోవింద్ వల్లభ పంత్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు.‘‘ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో పల్స్, రక్తపోటు పడిపోయి ప్రాణాలు ఉన్నట్టు లక్షణాలు ఏవీ కనిపించలేదు. మేము 40 నిమిషాలకు పైగా సీపీఆర్ (CPR) చేసి ప్రయత్నించాం.. కానీ బతికించలేకపోయాం... 12:48 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికలో మరణానికి గల కారణం వెల్లడవుతుంది’’ అని ఆసుపత్రి వైద్యుడు ప్రదీప్ భౌమిక్ అన్నారు. ఈ ఘటనకు దారితీసిన కచ్చితమైన పరిస్థితులు ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు.అమితాబ్ రంజన్ పదవీవిరమణ తర్వాత.. అనురాగ్ ధన్ఖడ్ మే 2025లో త్రిపుర పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ఆయన త్రిపుర ఇంటెలిజెన్స్ విభాం డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. అలాగే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనేక ఉన్నత స్థాయి దర్యాప్తులను నిర్వహించారు. రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఒకరైన ధన్ఖడ్ ఆకస్మిక మరణం పోలీసు వర్గాలు, ప్రభుత్వ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.