గుడ్‌న్యూస్.. మరింత పడిపోయిన బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో జులై 17న గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే!

Wait 5 sec.

Gold Price Fall: భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక ఆభరణంగానే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకునే సాధనంగా మారింది. దీంతో భారత ప్రజల జీవన విధానంలో ఈ ఖనిజం ఒక భాగమైపోయింది. అందుకే తమ స్తోమతకు తగినట్లు ఎంతో కొంత బంగారం కొంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు వస్తే బంగారం ఉండాల్సిందే. గత ఏడాది నుంచి బంగారం రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రికార్డ్ గరిష్ఠాల నుంచి పసిడి రేట్లు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో బంగారం రేట్లు కుప్పకూలుతున్నాయి. ఈరోజు సైతం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో జులై 17వ తేదీన హైదరాబాద్, విజయవాడలో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర మరోసారి 4 వేల దిగువకు వచ్చింది. ఈరోజు ఔన్స్ బంగారం రేటు 57 డాలర్ల మేర పడిపోయి 3992 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.60 డాలర్ల మేర తగ్గి 55.64 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.280 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,43,290 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల 916 బంగారం రేటు 10 గ్రాములకు రూ.250 మేర పడిపోయి రూ.1,31,350 వద్దకు దిగివచ్చింది. విజయవాడలో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆర్థిక నగరాల్లో ఒకటైన విజయవాడలోనూ పసిడి రేట్లు ఈరోజు తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి రేటు తులంపై రూ.280 తగ్గి రూ.1,43,290 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ.250 తగ్గి రూ.1,31,350 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటు బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ దేశీయంగా వెండి రేట్లు ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.2,40,000 మార్క్ వద్దే ట్రేడవుతోంది. గమనిక: పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు జులై 17 శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు 10 గంటల తర్వాత మారిపోతుంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి ధరలు వేరు వేరుగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానిక ధరలను తెలుసుకోవడం మంచిది.