ఈరోజు జులై 15న.. మీ PF వడ్డీ 8.25 శాతం జమ అయిందా? ఒక్క SMSతో ఈజీగా చెక్ చేయొచ్చు.. ప్రాసెస్ ఇదే

Wait 5 sec.

EPF Interest Rate: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వడ్డీ జమ ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను జులై 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన కేంద్రీకృత ఐటీ వ్యవస్థ (CITES- Centralized IT Enabled Services) ద్వారా అత్యంత వేగంగా ఈ ప్రక్రియలను పూర్తి చేస్తోంది. మరి మీ అకౌంట్లో వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులకు వడ్డీ జమ చేసే ప్రక్రియ జులై 15 బుధవారంతో ముగిసిందని చెప్పవచ్చు. 34 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా ఇటీవలే తెలిపారు. ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బులను జులై 15, 2026లోపు జమ చేస్తామని, వాటిని విత్ డ్రా చేసుకునేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పీఎఫ్ ఖాతా వడ్డీ ఎలా తనిఖీ చేయాలి? అంటే చందాదారులు ఈపీఎఫ్ బ్యాలెన్స్ ద్వారా వడ్డీ జమ అయిందా లేదా అనేది చెక్ చేయవచ్చు. అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉమాంగ్ యాప్ (UMANG App)ఈపీఎఫ్ఓ మెంబర్ ఇ-సేవా పోర్టల్ (EPFO member e-Sewa Portal)మిస్డ్ కాల్ సర్వీస్SMS సర్వీస్ఈపీఎఫ్ పాస్‌బుక్ లైట్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్బుక్ పోర్టల్ లోకి యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ కావాలిఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీతో వెరిఫై చేయాలివ్యూ అండ్ సెలెక్ట్ పాస్‌బుక్ లైట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్, విత్ డ్రాయల్స్, బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.SMS ద్వారా బ్యాలెన్స్ తనిఖీయూఏఎన్-యాక్టివేటెడ్ మెంబర్స్ తమ లెటెస్ట్ పీఎఫ్ కంట్రిబ్యూషన్స్, బ్యాలెన్స్ ఈపీఎఫ్ఓ కు ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. 7738299899 నంబర్‌కు EPFOHO UAN నంబర్ ఫార్మాట్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్ఎంఎస్ పంపించాలి. 10 ప్రాంతీయ భాషల్లోనూ పొందవచ్చు. తెలుగు కోసం EPFOTEL అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఉమాంగ్ యాప్ ద్వారాఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ అనేది మీ ఫోన్లో ఉండే ఉమాంగ్ యాప్ ద్వారానూ చెక్ చేయవచ్చు. యూఏఎన్ నంబర్ ద్వారా ఉమాంగ్ యాప్ ఈపీఎఫ్ఓ సర్వీసుల్లోకి లాగిన్ కావాలి. అయితే ముందుగా యూఎన్ఎన్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గత 3 నెలల బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవచ్చు.