PM Kisan 24th instalment date: దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున ప్రతి సంవత్సరం మూడు సార్లు రూ.6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 23 విడతల్లో నిధులను విడదల చేశారు. ఇప్పుడు 24వ విడత కింద రూ.2000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పంట సాగు మొదలైపోయిన చేస్తున్నారు. అయితే, మరి ఎప్పుడు 24వ విడత విడుదల చేస్తారు? రైతులు చేయాల్సిన పని ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం రూ.6000 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం ఇస్తోంది కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. అయితే, రైతులు ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయాలి. తమ భూమి వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్ని పూర్తి చూసి 2019కి ముందు పట్టాదారు పాసుపుస్తకం ఉన్నవారికి అర్హత లభిస్తుంది. దీంతో 24వ విడత కింద వచ్చే రూ.2000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. లేదంటే అర్హత ఉన్నా రూ.2000 రాకుండా ఆగిపోతాయి.24వ విడత ఎప్పుడు? 24వ విడత నిధులను అక్టోబర్ 2026లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి విడతకు మధ్య దాదాపు 4 నెలల గ్యాప్ ఉంటోంది. ప్రతి విడతలో రూ.2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి రోజుల్లో నిధుల విడుదల ఉండనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ ప్రాసెస్ ఇదేముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలిబెనిఫిషియరీ స్టేటస్ పేజీలోకి వెళ్లాలిబెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలిగెట్ డేటాపై క్లిక్ చేయాలిస్క్రీన్ పై బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.ఇ-కేవైసీ ప్రాసెస్ ఇదేముందుగా తమ ఫోన్లలో పీఎం కిసాన్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా యాప్ లోకి లాగిన్ కావాలిబెనిఫిషియరీ స్టేటస్ పేజీలోకి వెళ్లాలికేవైసీ స్టేటస్ No అని ఉంటే eKYCపై క్లిక్ చేయాలిమీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫేస్ స్కాన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలిదీంతో ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ లోకి వెళ్తుంది. దీంతో ఫేస్ స్కాన్ చేసి ఓకే చేయాలి. మరోవైపు ఓటీపీ ఆధారి కేవైసీ, బయోమెట్రిక్ ఆధారిక ఇ-కేవైసీ పూర్తి చేయవచ్చు.