5 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు చెక్ చేశారు.. మరి మీరూ? ఐటీ శాఖ వీడియో రిలీజ్.. ఏం చేయాలంటే?

Wait 5 sec.

Income Tax Returns: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ జులై 31, 2026 సమీపిస్తోంది. గతంలో చాలా మంది తమకు బ్యాంక్ అకౌంట్లలో వచ్చే వడ్డీలు, షేర్ల ద్వారా వచ్చే డివిడెండ్లు లేదా పెద్ద మొత్తంలో చేసిన ఇతర ఆర్థిక లావాదేవీలను ఐటీఆర్‌లో చూపించడం మరిచిపోయేవారు. దీనివల్ల ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చేవి. ఆ తర్వాత ఇబ్బందులు పడేవారు. అయితే, అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కీలక సూచనలు చేసింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల. 5 కోట్ల మంది ట్యాక్స్ పేయర్లు మిగిలిన వారు సైతం తనిఖీ చేశాకే ఐటీఆర్ ఫైల్ చేయాలని కోరింది. ఐటీ శాఖ ప్రవేశపెట్టిన వార్షిక సమాచార నివేదిక ద్వారా మీ పాన్ కార్డు ఆధారంగా జరిగిన ప్రతి చిన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ మీరే స్వయంగా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటికే 5 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు దీనిని ఉపయోగించినట్లు ఐటీ శాఖ తెలిపింది. 'బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ, డివిడెండ్లు, ఇతర హైవాల్యూ ట్రాన్సాక్షన్స్ వంటి వాటిని ఐటీఆర్ ఫైలింగ్ కోసం ట్రాక్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా? వార్షిక సమాచార నివేదిక (AIS) అనేది మీకు పూర్తి ఆర్థిక లావాదేవీల వివరాలను అందిస్తుంది. ఇప్పటికే 5 కోట్ల మందికిపైగా ఏఐఎస్ తనిఖీ చేశారు. మరి మీరూ?' అంటూ ఓ వీడియోను ఐటీ శాఖ పోస్ట్ చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్లోకి లాగిన్ అయ్యి అందులో ఏదైనా తప్పు ఉన్నట్లు గమనిస్తే ఆన్‌లైన్ ఫీడ్ బ్యాక్ ద్వారా రిపోర్ట్ చేయాలని కోరింది. ఏఐఎస్ తనిఖీ చేసి అన్ని వివరాలను చూసుకున్న తర్వాతే అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం ఐటీఆర్ 1, ఐటీఆర్ 2ను జులై 31, 2026లోపు ఫైల్ చేయాలని సూచించింది. వీడియో ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. AISస్టేట్మెంట్ చెక్ చేసే విధానంమీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు మీ ఏఐఎస్ స్టేట్మెంట్ సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని సరిచూసుకోవాలి. అందుకు ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ కావాలిలాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో టాప్ మెనూ బార్ లో ఉండే సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. అందులో కనిపించే ఏఐఎస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలిస్క్రీన్ పై ఒక పాప్- అప్ కనిపిస్తుంది. అక్కడ ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే ఏఐఎస్ కోసం ప్రత్యేక పోర్టల్ లోకి వెళ్తుంది. అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. టీఐఎస్, ఏఐఎస్ ఉంటాయి. మీ ఆర్థిక వివరాల కోసం ఏఐఎస్ పై క్లిక్ చేసి పీడీఎఫ్ లేదా జేఎస్ఓఎన్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.