‘పిట్ట కొంచెం, కూత ఘనం.. కూత కోసేయాలి’.. ముద్రగడపై కోపంతో రగిలిపోయిన ఎన్టీఆర్

Wait 5 sec.

తండ్రి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల వయసులోనే జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆహ్వానంతో టీడీపీలో చేరిన ఆయన.. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్లో ఆయన ఎక్సైజ్, రవాణా శాఖలకు మంత్రిగానూ ముద్రగడ పని చేశారు. ఎన్టీఆర్ తన పట్ల ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉండేవారని ముద్రగడ తెలిపారు. తనపై ఎవరో కుట్ర చేస్తే, ఆ విషయం తెలియని ఎన్టీఆర్ తనను ప్రశ్నించడం.. తాను తిరగబడి గొడవ చేయడం, ఆ తర్వాత తన నిజాయితీకి మెచ్చిన ఎన్టీఆర్ మంత్రి పదవి అప్పగించడం లాంటి విషయాలను ముద్రగడ గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..‘‘టీడీపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్టీఆర్ నాకు డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌ పదవిని అప్పగించారు. అయితే కొందరు నాపై కుట్ర పన్ని ఎన్టీఆర్ దగ్గర చెడు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓసారి నన్ను పిలిచి దేనికైనా (ప్రలోభాలకు) లోనయ్యావా అని అడిగారు.. దీంతో నేను పట్టరాని కోపంతో సీఎంపై తిరగబడ్డాను. మా జీవితాలను పణంగా పెట్టి మీ ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నారా? అని గట్టి గట్టిగా కేకలు వేశాను. చెక్క పార్టిషియన్‌తో చేసిన పక్క గదిలోనే చంద్రబాబు నాయుడు, హరిరామ జోగయ్య, ఉపేంద్ర తదితరులు ఉన్నారు. మా తాత, తండ్రి పేరు ప్రతిష్టల కోసమే నేను రాజకీయాల్లో ఉంటున్నాను. మీరు ఏదో సర్టిఫికెట్ ఇస్తారని నిజాయితీతో ఉండటం లేదు. మీ ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే పడటానికి నేను సిద్ధంగా లేను రామారావు గారు అంటూ.. పెద్ద పెద్దగా కేకలు వేశాను. కూల్ బ్రదర్ అని ఎన్టీఆర్ వారిస్తున్నా నేను వినిపించుకోలేదు. డ్రైనేజీ బోర్డు చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేస్తున్నాను. ఎంక్వైరీ చేసుకొని చెప్పండి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పి.. కుర్చీలు, డోర్‌ను తన్నుకుంటూ వెళ్లిపోయాను. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎన్టీఆర్ ఉండిపోయారు.పిట్ట కొంచెం కూత ఘనం.. కూత కోసేయాలి.. ఈ బచ్చా గాడు నాతో ఇలా అంటాడా అనే కసితో.. ఫైల్స్ తీయండి, తీయండి అంటూ ఎన్టీఆర్ రాత్రి 10 గంటలైనా నిద్రపోలేదు. తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఐదు జిల్లాల్లో ఉన్న ఆఫీసర్లకు ఫోన్లు చేయించారు. డ్రైనేజీ బోర్డు ఛైర్మన్‌కు పర్స్ (లంచం) ఇచ్చిన వివరాలను వెంటనే తన ముందు ఉంచాలని ఆదేశించారు. ‘పర్స్ పుచ్చుకోవడం కాదు కదా.. క్యారేజీ డబ్బులు కూడా ఆయన ఇచ్చేశారు’ అని అందరూ చెప్పారు. తర్వాత ఇచ్ఛాపురం ఎమ్మెల్యే కృష్ణారావుతో పద్మనాభం తిరగబడుతున్నారని ఎన్టీఆర్ చెప్పారు. దీంతో పద్మనాభం తప్పు చేయలేదు, నేను ఇచ్చిన లిస్ట్ వేరేదని ఆయన చెప్పడంతో ఎన్టీఆర్ రియలైజ్ అయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో నన్ను తీసుకొని రమ్మని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు కారును పంపించారు. అక్కడ పని చేసే ఉద్యోగి ఒకరు నాకు ఈ వివరాలు చెప్పారు.ఇంటికి వెళ్లగానే ఉదయమే ఉపేంద్ర గారో, నాదెండ్ల భాస్కర్ గారో గుర్తు లేదు నాకు ఫోన్ చేశారు. సీఎం మీతో మాట్లాడతారు లైన్లో ఉన్నారని చెప్పారు. నాకు అవినీతి మైల పట్టింది నాతో మాట్లాడితే మీకు కూడా ఆ మైలపడుతుంది చెప్పి ఫోన్ పెట్టేశాను. అలా మూడుసార్లు చేశాను. పద్మనాభం విను, విను అని అటు నుంచి చెబుతున్నా నేను పట్టించుకోలేదు. నాలుగోసారి ఫోన్ వస్తే ప్లగ్ పీకేసి.. ఫోన్‌ను కట్టగట్టి మంచం కింద పెట్టేశాను.కాసేపటికే కాకినాడ నుంచి టెలికాం డీఈ వచ్చాడు. సార్ సీఎం గారు ఫోన్లో మాట్లాడతారట అని చెప్పాడు. ‘ఈ పని నీది కాదు.. బయట లైన్ బాగోలేకపోతే చేయండి. ఇంట్లో మీకేం పని లేదు’ అని చెప్పి పంపించాను. రెండు నెలలపాటు నా రాజీనామాను ఆమోదించలేదు. ఈలోగా ఎంతో మందిని పంపించి మాట్లాడించే ప్రయత్నం చేశారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అయినా నేను సీఎం దగ్గరకు వెళ్లలేదు.ఎన్నో ప్రయత్నాల తర్వాత నేను వెళ్లే సరికి.. రామారావు గారు పళ్లు కొరుకుతున్నారు. భాస్కర రావుతో వెళ్లలేదు, మంత్రి పదవి ఇస్తానన్నా రావడం లేదు. వీడి పొగరు ఏంటని ఆయన అనుకుంటున్నారు. ‘అబ్బాయ్ ఏం మాట్లాడకు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని చెప్పు’ అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు నాతో చెప్పారు. అప్పుడే గవర్నర్ అనుకోకుండా పంజాబ్ వెళ్లారు. దీంతో వారం ఆగి మంత్రిగా ప్రమాణం చేద్దువు బ్రదర్ అని చెప్పి పంపించారు. దీంతో హమ్మయ్య అని వెనక్కి వచ్చేశాను. మంత్రి పదవి ఇస్తానని చెప్పినా వద్దని చెప్పాను.Read Also: ఈలోపే అసెంబ్లీ రద్దయ్యింది. ఎమ్మెల్యే టికెట్ కోసం నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. రామారావు గారు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మళ్లీ మంత్రి పదవి ఇస్తారేమోనని దూరంగా ఉండేవాణ్ని. ఎక్కడ ఉన్నానో తెలియకుండా ఉండటం కోసం రోజుకో హోటల్ మారేవాణ్ని. మొత్తానికి ఏదోలా పట్టుకొని నన్ను రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. డ్రైనేజీ బోర్డు గొడవంతా ఆయన నాతో చెప్పుకొచ్చారు. ‘బ్రదర్ రోజూ ఎంతో మందితో మాట్లాడతాను. ఎంతో మంది నన్ను విసిగిస్తారు. ఆ తర్వాత మీరు వస్తారు. ఆ కోపం మీ మీద చూపిస్తాను. మిమ్మల్ని అనాలని కాదు. ఇలాంటివి మళ్లీ రాకూడదు. వస్తే పార్టీ దెబ్బతింటుంది. నువ్వు చదువుకున్న వాడివని, డబ్బు ఉన్నవాడివని కాదు.. నీ నిజాయితీని చూసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నాను, చేరాలి అన్నారు. వెనుక నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాకు బ్రీఫింగ్ చేస్తున్నారు.Read Also: నాతో సంతకం పెట్టించి కార్లో తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్సైజ్ శాఖను అప్పగించారు. ‘ఇది చిన్న పోర్టుఫోలియో కాదు, అవినీతి పోర్ట్‌ఫోలియో అని చెప్పుకుంటారు. అలాంటిది నీ నిజాయతీని చూసి నీకు ఇచ్చారు, జాగ్రత్తగా పనిచేయి’ అని బొడ్డు భాస్కర రామారావు నాతో చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా నాకు రామారావు గారు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వేల ఉద్యోగాలను కల్పించాను’’ అని ముద్రగడ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.