క్రికెట్ చరిత్రలో మెగా మార్పులు.. వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లు ఎలా మారాయో తెలుసా?

Wait 5 sec.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ల నిర్వహణలో గత ఐదు దశాబ్దాలుగా చారిత్రాత్మక మార్పులను తీసుకువస్తూనే ఉంది. 1975లో ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభమైన తొలి ప్రపంచకప్ నుంచి రాబోయే 2027 మెగా టోర్నీ వరకు క్రికెట్ రూల్స్, మ్యాచ్‌ల ఫార్మాట్లు తరచూ మారుతూ వచ్చాయి. టోర్నమెంట్‌లో పోటీ స్థాయిని పెంచడం, ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత కల్పించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మరింత ఆసక్తికరమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఐసీసీ ఈ మార్పులను ప్రవేశపెట్టింది.1975లో జరిగిన మొట్టమొదటి వన్డే ప్రపంచకప్‌లో కేవలం 8 జట్లు మాత్రమే బరిలోకి దిగాయి. ఆ సమయంలో జట్లను 2 గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు నేరుగా సెమీఫైనల్స్ చేరేలా సింపుల్ ఫార్మాట్‌ను రూపొందించారు. 1979, 1983, 1987లోనూ దాదాపు ఇదే ఫార్మాట్ కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో క్రికెట్ క్రేజ్ పెరగడంతో జట్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు.1992లో 9 టీమ్‌లు పాల్గొన్నాయి. రౌండ్-రాబిన్ పద్ధతిలో లీగ్ స్టేజ్‌లో ప్రతీ జట్టు మిగతా జట్టుతో మ్యాచ్ ఆడింది. టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్ చేరాయి. ఇక 1996లో 12 జట్లు పాల్గొనగా.. ఆరు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఇందులో ప్రతీ గ్రూపులో టాప్-4లో నిలిచిన జట్లు.. క్వార్టర్స్ చేరాయి. అందులో గెలిచిన జట్లు సెమీస్, ఆపై ఫైనల్ చేరాయి.1999లో 'సూపర్ సిక్స్' ఫార్మాట్‌ను పరిచయం చేశారు. 12 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో 2 గ్రూపులు చేశారు. టాప్-3 జట్లు సూపర్-6 చేరాయి. అక్కడ టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్ చేరాయి. 2003లో 14 జట్లు ఆడగా.. వాటిని కూడా రెండు గ్రూపులు చేసి, సూపర్ 6 ఆడించారు.2007లో ఏకంగా 16 జట్లతో టోర్నీ నిర్వహించింది ఐసీసీ. 4 జట్లతో 4 గ్రూపులు విభజించింది. టాప్-2లో నిలిచిన జట్లతో సూపర్-8 నిర్వహించింది. అక్కడ తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సెమీస్ జరిగింది.2011, 2015లో 14 టీమ్‌లు పాల్గొన్నాయి. ఏడేసి జట్లతో 2 గ్రూపులు చేశారు. టాప్-4లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్ ఆడాయి. ఆపై సెమీస్, ఫైనల్ నిర్వహించారు. ఇక 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో 10 జట్లు పాల్గొన్నాయి. లీగ్ స్టేజ్‌లో రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచులు జరిగాయి. టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్ చేరాయి. దీని ప్రకారం 12, 13, 14 ర్యాంక్ జట్ల మధ్య సూపర్ సిరీస్ జరుగుతుంది. అందులో నుంచి ఒక జట్టు అసలైన టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తుంది. అప్పుడు 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. టాప్-3 టీమ్‌లతో పాటు రెండు గ్రూపులలో కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో జట్టు సూపర్-7కు చేరుతుంది. సూపర్-7లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి.