మీ ఇంట్లోనూ ఆడబిడ్డలు ఉంటారు.. బండి భగీరథ్‌ పోక్సో కేసు వ్యాఖ్యలపై లోకేష్‌‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నేత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రమాదం చేసిన తర్వాత భయంతో ఇంటికి వచ్చిన కుమారుడిని పోలీసులకు అప్పగించడం తల్లిదండ్రుల కనీస బాధ్యత అని నారా లోకేష్ వ్యాఖ్యానించగా.. ఈ సందర్భంగా తెలంగాణలో నమోదైన బండి భగీరథ్ పోక్సో కేసును ఉదాహరణగా ప్రస్తావించారు. పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడింది.నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ వేదికగా స్పందించారు. బండి భగీరథ్ పోక్సో కేసులో పూర్తిస్థాయి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నారా లోకేష్‌కు సూచించారు. ఈ కేసులో బాధిత బాలిక ఏడాది పాటు వేధింపులు, అత్యాచారయత్నం ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని.. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉండే ఉంటారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. బాధితురాలిపై జరిగిన వేధింపులు అతడి తండ్రి గారికి తెలవకుండా జరిగి ఉంటాయా అని ప్రశ్నించారు. అంతకుముందే 2023లో తోటి విద్యార్థులను బండి భగీరథ్ చితకబాదితే ఇదే బండి సంజయ్ తన కొడుకును వెనకేసుకొచ్చారని గుర్తు చేశారు. కేసు నమోదైన వెంటనే బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోలేదని.. కేసు నమోదైన తర్వాత 9 రోజుల పాటు రాజకీయ, న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాకే సరెండర్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవధిలో బాధితురాలిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని.. ఆ కుటుంబాన్ని ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. అలాంటి వ్యవహారంలో సరెండర్ మొదటి రోజే ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.బాధితురాలు, ఆమె తల్లిపై కరీంనగర్‌లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తర్వాత.. న్యాయస్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తర్వాత.. న్యాయస్థానం నుంచి తమ అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి.. ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తర్వాత.. బండి సంజయ్ ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక బండి భగీరథ్‌ను దాచడం తన వల్ల కాదు అని చేతులెత్తేసిన తర్వాత.. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తర్వాత.. గౌరవ న్యాయస్థానంలో బెయిల్ దొరకదని తెలిసిన తర్వాత బండి సంజయ్ తన కుమారుడిని సరెండర్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.అలాగే బాధితురాలి వాంగ్మూలంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. బండి సంజయ్ బాగా పరిచయం ఉంటే.. ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కావాలని చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత విషయంలో నిజంగా కట్టుబడి ఉంటే.. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని నారా లోకేష్ డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఈ అంశంపై తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడును అడిగినట్లు చెప్పగలరని.. జై తెలంగాణ జై హింద్ అంటూ తన ట్వీట్‌ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముగించారు.