మాజీ ప్రధాని షేక్ హసీనా రాకను స్వాగతించిన బంగ్లాదేశ్.. మరణశిక్ష అమలుపై సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్టు చేసిన ప్రకటనను స్వాగతించింది. అయితే, మరణశిక్ష పడిన ఖైదీగా ఆమె న్యాయవిచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆగస్టు 2024లో విద్యార్థుల ఉద్యమంతో నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోగా.. ఆమె దేశం విచిడి పారిపోయి భారత్‌కు వచ్చి తలదాచుకున్న సంగతి తెలిసిందే. తన పార్టీని తిరిగి బలోపేతం చేసుకునేందుకు ఈ ఏడాది చివరి నాటికి స్వచ్ఛందంగా హసీనా బంగ్లాదేశ్‌కు వచ్చేందుకు సిద్ధమైనట్టు ఆమె సన్నిహిత వర్గాలు గతవారం వెల్లడించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ప్రధాన సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్ స్పందించారు. మీడియా బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ... విద్యార్థులపై ఆమె ప్రభుత్వం క్రూరమైన అణచివేత, మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని షేక్ హసీనాకు ఆయన సవాల్ విసిరారు. ‘‘బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనే ఆమె నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.. ఎందుకంటే ఆమె చేసిన నేరాలకు గాను మరణశిక్ష అమలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.విచారణ ఎదుర్కోవాల్సిందే‘ఆమె తనను తాను రక్షించుకోడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ లాయర్లను ఢాకాకు రప్పించుకోవచ్చు’ అని అన్నారు. లో జరిగే విచారణ పారదర్శకంగానే ఉంటుందని, దానిని పరిశీలకులు పర్యవేక్షించవచ్చని, వీడియో కవరేజ్ ద్వారా ప్రసారం చేయవచ్చని రెహమాన్ అన్నారు. హసీనాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కోర్టు సవరించడం లేదా ఆమెను నిర్దోషిగా విడుదల చేసినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె తిరిగి రావాలనే ప్రణాళికపై ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా ఆయన తెలిపారు.బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన హసీనా.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన వీధి పోరాటంతో పదవీచ్యుతురాలయ్యారు. 2010లో అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ట్రైబ్యునల్ తీర్పులపై గతంలో కూడా స్టేలు విధించడం లేదా వాటిని రద్దు చేయడం జరిగిందని రెహమాన్ పేర్కొన్నారు. ‘ఆమె తిరిగి రావడానికి విధానపరమైన సమస్యలు అడ్డంకి కావు.. ఈ విషయంపై ఢాకాతో సంప్రదించిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకోవచ్చు’’ రెహమాన్ అన్నారు.2024లో జరిగిన నిరసనలపై ఆమె ప్రభుత్వం జరిపిన క్రూరమైన అణచివేతకు సంబంధించి, 'మానవత్వానికి వ్యతిరేక నేరాల' ఆరోపణలపై గత ఏడాది నవంబర్‌లో ఢాకాలోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. అయితే, మరణశిక్ష, క్రిమినల్ చర్యలు, ఆరోపణలను 'రాజకీయ ప్రేరేపితమైనవి'గా హసీనా కొట్టిపారేశారు. ఈ తీర్పు తర్వాత ఆమెను అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరుతోంది.భారత్ స్పందనమరోవైపు, హసీనా స్వదేశానికి వెళ్లాలనే ప్రణాళికలపై భారతదేశం జాగ్రత్తగా స్పందిస్తూ, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ‘‘ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అప్పగింతకు సంబంధించిన ఏ విషయమైనా చట్టపరమైన అంశమే దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.భారత్-బంగ్లా సంబంధాలుషేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాల్లో అనిశ్చితి ఏర్పడింది. మొహమూద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హయాంలో క్షీణించిన సంబంధాలను తిరిగి పునరుద్దరించే ప్రయత్నాలు ఇరు దేశాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భారత్ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు.