అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. , నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ఇప్పటికే దాదాపు రూ.70 కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ.. ''లెనిన్' నా లైఫ్ లో చాలా ముఖ్యమైన సినిమా. ఇది ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం దర్శకుడు నంద కిషోర్ అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లు దాటిపోయింది. మధ్యలో ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటూ 13 సంవత్సరాలు గడిపేశాను. పదమూడేళ్ల తర్వాత మళ్లీ పరిశ్రమకు వస్తే, నాకు ఘనమైన స్వాగతం పలికి గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు'' అని అన్నారు. ''సినిమా ఏమీ మారలేదు. ఎప్పటికీ మారదు కూడా. ఇండియన్ సినిమాలో ఎమోషన్, గ్లామర్.. ఇవి రెండే ఉంటాయి. ఎన్ని తరాలు మారినా ఎమోషన్ అలానే ఉంటది. ఆ ఫార్ములా ఎప్పటికీ మారదు. కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రతీ సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది మంచి కథలతో వస్తారు కానీ.. దాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది 15 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసి, తన ఊర్లో ఉన్న పాత్రలతో 'లెనిన్' లాంటి ఒక గొప్ప కథ రాసుకున్నాడు మురళీ కిషోర్. నాకు అందులో ఎద్దిరాజులు పాత్ర ఇచ్చినందుకు ధన్యవాదాలు'' ''చాలా సినిమాలకు ఫైట్స్, పాటలు వర్కౌట్ అయ్యాయని అంటారు. లెనిన్ సినిమాకి మాత్రం 200 శాతం కథ మాత్రమే వర్కౌట్ అయింది. రాజమౌళి దగ్గర నుండిఇప్పుడు మురళీ కిశోర్ వరకూ.. అందరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ఫామిలీ, డ్రామా, సెంటిమెంట్, మంచి సాంగ్స్ ను నమ్ముకొని హిట్లు కొడుతున్నారు. అంతేకానీ కొరియన్ సినిమాలు చూసి కాదు. నేటివిటీ కథను అద్భుతమైన డ్రామాను 'లెనిన్' సినిమాలో చూశాం. ప్రేక్షకులు దాన్ని బ్లాక్ బస్టర్ హిట్టు చేశారు. మురళీ కిషోర్ ఈతరానికి రాజమౌళి లాంటి దర్శకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను''''ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా సినీ ఇండస్ట్రీ రావాలి. మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయవాదాల నేపథ్యంలో ఇక్కడ కూడా కళాకారులకు అవకాశాలు రావాలి. సినీ పరిశ్రమకు 20-30 ఎకరాల జాగా ఇవ్వాలని ప్రభుత్వానికి, మంత్రి దుర్గేష్ కి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండు రాష్ట్రాలుగా విడిపోయారు కాబట్టి, ఈ ప్రాంతంవారికి కూడా పరిశ్రమ దగ్గరవ్వాలి. కచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి. తెలుగు పరిశ్రమ చాలా పెద్దది. ఇంకో తెలుగు రాష్ట్రం అమెరికాలో కూడా మనవాళ్లు ఉన్నారు. కాబట్టి ఏపీలో కూడా టాలెంట్ చేయాలి''''మనం' చిత్రాన్ని కలుపుకుంటే 'లెనిన్' అఖిల్ బాబుకి 8వ సినిమా. అఖిల్ కి అచ్చొచ్చిన నెం.8. ఆయన బర్త్ డేట్ 8. నరేంద్ర మోదీ గారి నెం.8.. గంగూలీ గారికి 8. 'ఎనిమిది' చాలా పవర్ ఫుల్ నెంబర్. చాలా కష్టపెడుతుంది. కానీ కచ్చితంగా చాలా పెద్ద లెవల్ లో వర్కౌట్ అవుద్ది. డౌటే లేదు.. అయ్యగారే నెం.1'' అని శివాజీ చెప్పుకొచ్చారు.