తెలంగాణలో అమర రాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్లాంట్‌ ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెప్పాలంటూ గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రి ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలంగాణలో అమర రాజా ప్లాంట్‌ను ప్రారంభిస్తే.. ఏపీ ఆయనకు ఎందుకు సారీ చెప్పాలని అనుకుంటున్నారా? గతంలో ఏం జరిగింది? లోకేశ్ ఎందుకు ఇలా రాసుకొచ్చారో తెలియాలంటే ఈ కథనం చదవండి..ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా.. అమర రాజా సంస్థను 1980ల్లో చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో ఈ సంస్థను ప్రారంభించారు. అమెరికాలో చదువుకొని, అక్కడ కొంత కాలం ఉద్యోగం చేసిన రామచంద్ర నాయుడు.. తన సొంత జిల్లాలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇండియా తిరిగొచ్చి ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. తన తల్లిదండ్రులు అమరావతి, రాజగోపాల్ నాయుడు పేర్లు కలిసొచ్చేలా.. అమర రాజా అని దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం ఆయన కుమారుడైన కంపెనీ బాధ్యతలను చూస్తున్నారు.బ్యాటరీలను ఉత్పత్తి చేసే అమర రాజా సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎంతో మంది యువతకు ఉపాధిని కల్పించింది. క్రమంగా ఇతర రంగాలకు సైతం ఈ కంపెనీ విస్తరించింది. గత ప్రభుత్వ హయాంలో కరకంబాడిలోని అమర రాజా బ్యాటరీస్ ప్లాంట్‌లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ పరిశ్రమ చుట్టు పక్కల గాలి, నీరు, భూమిలో హానికరమైన సీసం కాలుష్యం ఎక్కువగా ఉందని, నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఫ్యాక్టరీని మూసేయాలని ఆదేశించింది. దీంతో సంస్థ కోర్టును ఆశ్రయించగా.. మూసివేత ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన న్యాయస్థానం విచారణను పొడిగించింది.గల్లా జయదేవ్ 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తమను వేధిస్తుందనే భావనతో అమర రాజా సంస్థ రూ. 9500 కోట్ల లిథియం-అయాన్ గిగా కారిడార్‌ను . అంతే కాకుండా వ్యాపారంపైనే పూర్తి ఫోకస్ పెట్టడం కోసం .వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే ‘గల్లా జయదేవ్, మీకు ఆంధ్రప్రదేశ్ క్షమాపణలు చెప్పాలి’ అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.‘‘గత నాలుగు దశాబ్దాలుగా.. ఏపీ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయగాథల్లో ఒకటిగా మాత్రమే అమర రాజా మిగిలిపోలేదు. ప్రపంచ స్థాయి ఉత్పాదకతను సృష్టించడంతోపాటు వేలాది మందికి ఉపాధి కల్పించింది. చిత్తూరు, ఏపీ పేరు ప్రతిష్టలను దేశానికి, ప్రపంచానికి చాటింది.గత సర్కారు హయాంలో మీ కంపెనీ ఎదుర్కొన్న వేధింపులు జరగకుండా ఉండాల్సింది. సొంత రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారిని ప్రోత్సహించాలి కానీ, బెదిరించకూడదు. మన రాష్ట్రంలో పుట్టిన కంపెనీ తన పురోగతి కోసం సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రానికి వెళ్లడం నన్ను బాధిస్తోంది.మేం మళ్లీ నమ్మకాన్ని తిరిగి పొందుతున్నాం. ఈ తరుణంలో మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. పారిశ్రామిక రంగానికి ఆంధ్రప్రదేశ్ మరోసారి స్వాగతం పలుకుతోంది. అమర రాజా ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైందో అక్కడే.. ఆ సంస్థ విజయవంతమైన అధ్యాయాలు లిఖించబడతాయని ఆశిస్తున్నాం. మా తలుపులు, మా హృదయాలు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి. తెలంగాణలో ప్రారంభిస్తున్న మీ కొత్త ఫెసిలిటీకి శుభాకాంక్షలు’ అని గల్లా జయదేవ్ పోస్టుకు బదులిస్తూ.. లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.