ఒక్క 'నామినీ'తో 3 పథకాల బెనిఫిట్స్.. EPFO సభ్యులు ఇంట్లోంచే యాడ్ చేయొచ్చు.. ప్రాసెస్ ఇదే!

Wait 5 sec.

EPFO e-Nomination: ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉంటుంది. అయితే, చాలా మంది ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేయడం మార్చిపోతుంటారు. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా నామినీ తప్పనిసరిగా పేర్కొనాలి. మన తర్వాత మన సొమ్ము ఎవరికి ఇవ్వాలో ముందుగా చెప్పే ఒక వీలునామానే ఈ నామినీ ప్రక్రియ. చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అలా చేస్తే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అందించే 3 పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఆ పథకాలు ఏంటి? ఇంట్లో నుంచి ఇ- నామినేషన్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి అనేది తెలుసుకుందాం.భవిష్యత్తులో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఈపీఎస్ పెన్షన్ (EPS), రూ. 7 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ (EDLI) ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందాలంటే ఇ-నామినేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వరకే నామినీ వివరాలు ఇచ్చినా, ఒక వేళ వివాహం జరిగి భాగస్వామి పిల్లల వివరాలు ఇవ్వడం సైతం ముఖ్యమే. ఇ- నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు యూఏఎన్ (UAN)కి ఆధార్ నంబర్ లింక్ చేసి ఉండాలి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల పేర్లు ఇవ్వొచ్చు. ఆధార్, ఫోటో వివరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి.ఇంట్లో నుంచే చేసే ప్రాసెస్ ఇదేముందుగా EPFO మెంబర్ పోర్టల్ లోకి యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.ఆ తర్వాత మేనేజ్ ట్యాబ్ లోకి వెళ్లి ఇ-నామినేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.అందులో కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేయాలా అని అడిగినప్పుడు YES పై క్లిక్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, అడ్రస్, ఫోటో వంటివి ఎంటర్ చేయాలి.ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంచుకోవాల్సి వస్తే ఎవరికి ఎంత శాతం ఇవ్వాలో నమోదు చేయాలి. మొత్తంగా 100 శాతం పూర్తి చేయాలి. వివరాలు ఇచ్చాక సేవ్ చేయాలి.ఆ తర్వాత ఇ-సైన్ చేయడంతో ఆ వివరాలు చెల్లుబాటు అవుతాయి.e-sign పై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ వివరాలు ఇవ్వాలి.ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.