బయట ఎవరికో పిల్లని ఇస్తే ఎలా చూసుకుంటారో ఏంటో అన్న భయం ఈ రోజుల్లో అందరికీ ఉంది. అందుకే దాదాపు తెలిసిన వాళ్లకే అమ్మాయిని ఇస్తున్నారు. దగ్గరగా ఇస్తే అలా పోయి ఇలా చూసి రావొచ్చనే ఆశ కూడా పేరెంట్స్‌లో ఉంటుంది. కానీ.. అయినవాళ్లకి పిల్లని ఇచ్చినా అవే వేధింపులు వస్తున్నాయి. ఇక్కడ సొంత మేనమామకే పిల్లనివ్వగా, అతని వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి మరీ ఆత్మహత్య చేసుకుంది ఓ వివాహిత. ఈ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మండలం ధర్మవరం గ్రామానికి చెందిన మరడ రుక్మిణమ్మ, దేవెందర్‌కు ఒక ధనలక్ష్మి (27) అనే కుమార్తె ఉంది. 2018 ఆగస్టులో ఒడిశా రాష్ట్రం రొంపా బొరడా గ్రామానికి చెందిన అమ్మాయికి మేనమామ అయ్యే నందిక లోకనాథానికి ఇచ్చి వివాహం చేశారు. ఎనిమిదేళ్ల వీరి బంధానికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో ఈ మధ్య వివాదాలు మొదలయ్యాయి. చీటికిమాటికి గొడవలు వస్తుండటంతో మేనమామతో కాపురం చేయలేక ఆమె తన పుట్టిల్లయిన ధర్మవరానికి వచ్చేసింది. సంసారంలో గొడవలు సహజం అని చెప్పి పెద్దలు చాలా సార్లు రాజీ చేసే ప్రయత్నాలు చేశారు. READ ALSO ఎన్నిసార్లు రాజీ చేసినా భర్త వేధింపులు పెడుతుండటంతో మళ్లీ పుట్టింటికి వస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గానీ భర్త వేధింపులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఈ వివాహిత పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కిందికి దింపి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతదేహం వద్ద ఏడేళ్ల కొడుకు రక్షిత్ ఏడుస్తున్న తీరు అక్కడ ఉన్న వారందరినీ క్నీళ్లు పెట్టించింది. భర్త వేధింపులు తాళలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి రుక్మిణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.