జగన్ చేస్తున్న పెద్ద తప్పు అదే.. వైసీపీకి నష్టం, ముద్రగడ అంత్యక్రియల్లో అలా చేయడం కరెక్ట్ కాదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

Wait 5 sec.

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో జరిగిన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ అంత్యక్రియల సమయంలో జగన్ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడం సరికాదని.. జగన్ కార్యకర్తల్ని వారించాలని సూచించారు నాగేశ్వర్. ఓ మీడియా ఛానల్‌లో తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. అంత్యక్రియల సమయంలో సీఎం, సీఎం అనడం కచ్చితంగా తప్పని.. ఇది సరైన సమయం కాదన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ముద్రగడ మరణం వల్ల వచ్చే సానుభూతి ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు.రాజకీయంగా తర్వాత సానుభూతిని తమవైపు మలచుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తుందన్నారు నాగేశ్వర్. రాజకీయాల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు తప్పదు కానీ ఆ ప్రయత్నం ఇంత వికృతరూపం దాల్చాల్సిన అవసరం లేదన్నారు. పద్మనాభం వైఎస్సార్‌సీపీ కాబట్టి ఆ పార్టీ నేతలు ఈ ప్రయత్నాలు అవునన్నా కాదన్నా చేస్తారన్నారు. ముద్రగడకు జోహార్ అనాల్సిన సమయంలో వైఎస్సార్‌సీపీ జిందాబాద్ అనకూడదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి జోహార్ నినాదాలు చేయాల్సింది పోయి.. జగన్ సీఎం నినాదాలు ఏంటి? అదేం గోల అంటూ ఘాటుగా స్పందించారు. జగన్‌కు తెలియకుండా ఇదంతా జరిగి ఉండొచ్చని.. కానీ సందర్భాన్ని బట్టి పద్ధతి మారాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలైనా కార్యకర్తల్ని వారించాలన్నారు.లో వైఎస్సార్‌సీపీ జిందాబాద్ అనడమే అవనసరమని.. అలాంటిది జగన్ సీఎం అనడం సరికాదన్నారు నాగేశ్వర్. అక్కడ ముద్రగడ జోహార్లు అర్పించడం ముఖ్యమా.. జగన్‌కు జేజేలు పలకడం ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకుని.. తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని.. ఇది జగన్ చేస్తున్న పెద్ద తప్పని వ్యాఖ్యానించారు. ముద్రగడ మరణమైనా, మిర్చి రైతుల సమస్య అయినా, మత్స్యకారుల విషాదమైనా, మామిడి రైతైనా, పొగాకు రైతేనా.. ప్రతి విషయాన్ని గమనిస్తే.. జగన్‌ తనను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని.. ఇది వైఎస్సార్‌సీపీ చేస్తు్న్న పెద్ద తప్పని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.'గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమం జరిగిందని.. ఆ సమయంలో ఎక్కడా చంద్రబాబు ముందు లేరు. చంద్రబాబు, టీడీపీ లేకుండా రైతుల ఉద్యమం జరిగిందో? లేదో? మనకు తెలుసు.. కానీ ఆ సమయంలో అమరావతి రైతులు ముందు ఉన్నారు.. టీడీపీ కావాల్సిన ఏర్పాట్లు చేసింది. అమరావతి రైతులు ఎక్కడా చంద్రబాబు సీఎం అని నినాదాలు చేయలేదు.. రైతులు తమ సమస్యల్ని పక్కన పెట్టలేదన్నారు. కానీ జగన్ చేస్తున్న పెద్ద తప్పు ఇదే.. ప్రతిదాన్ని తన బ్రాండ్‌గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతుల సమస్య వస్తే మామిడి రైతుల సమస్యలు ముందు ఉండాలి. పొగాకు రైతుల సమస్య వస్తే పొగాకు రైతుల సమస్యలు ముందు ఉండాలి. మత్స్యకారుల సమస్య అంటే మత్స్యకారుల సమస్యలు ముందు ఉండాలి. ముద్రగడ మరణం అయితే ముద్రగడ జోహార్లు చెప్పడం తప్ప ఇంకేమీ చేయకూడదు. వైఎస్సార్‌‌సీపీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గమనించాలి' అని సూచించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.